వైయస్ఆర్ బయోపిక్ లో విజయమ్మ పాత్ర నయనతార కాదు, మరెవరో తెలుసా ?
వైఎస్ఆర్ బయోపిక్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి చర్చే నడుస్తుంది. సావిత్రి, ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్న సందర్భంలో వైఎస్ఆర్ బయోపిక్ కూడా హాట్ టాపిక్ గా మారింది. యాత్ర పేరుతో తెరకేక్కబోయే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్. విజయమ్మ పాత్రకు సంభదించి ఒక ఆసక్తికరమైన వార్తా తెలిసింది.

రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర ప్రకటన
వైఎస్ఆర్ బయోపిక్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి చర్చే నడుస్తుంది. సావిత్రి, ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్న సందర్భంలో వైఎస్ఆర్ బయోపిక్ కూడా హాట్ టాపిక్ గా మారింది. యాత్ర పేరుతో తెరకేక్కబోయే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్.

మెయిన్ లీడ్ లో మముట్టి
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాస్ లీడర్. ఆయన పోయి పదేళ్లవుతున్నా ఇప్పటికీ ఆ ఛరిష్మా మాత్రం అలాగే ఉంది. దాంతో ఇప్పుడు యాత్ర సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మహిత్ రాఘవ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించబోతున్నాడు.

విజయమ్మ పాత్రలో నయనతార చెయ్యడం లేదు
అన్నింటికంటే ముఖ్యంగా జగన్ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనేది పెద్ద ప్రశ్న. జగన్ పాత్రలో ముందుగా వేరే హీరోలు నటిస్తారని పేర్లు వినిపించినా చివరికి తమిళ్ హీరో సూర్య ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. విజయమ్మ పాత్రలో నయనతార నటిస్తుందని వార్తలు వచ్చాయి కాని ఆ న్యూస్ లో నిజం లేదని తెలుస్తోంది.

రమ్యకృష్ణ విజయమ్మ పాత్ర చేసే అవకాశం
తాజా సమాచారం మేరకు విజయమ్మ పాత్రలో రమ్యకృష్ణ నటించే అవకాశం ఉందని సమాచారం. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి సతీమణి పాత్రలో నటించబోతోందని సమాచారం. మలయాళం హీరో, తమిళ్ హీరోయిన్ కలిసి తెలుగు లీడర్ సినిమాలో నటిస్తే సినిమకు అన్ని భాసల్లో విడుదల చేయొచ్చు అని చిత్ర యూనిట్ ఆలోచన.


Click it and Unblock the Notifications











