Balakrishna: బాలయ్య కోసం ముగ్గురు హీరోయిన్లు పోటీ... ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది?
నటసింహం బాలయ్య గురించి, ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు వింటేనే ఎనర్జీ... సిచ్యూవేషన్ తో సంబంధం లేకుండా జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ స్లోగన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఆయన సినిమా కోసం ముగ్గురు హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. బాలయ్య బాబీ సినిమాలో హీరోయిన్ కోసం ముగ్గురిని అనుకుంటున్నారట. మరి అందులో ఎవరు ఫిక్స్ అయ్యారు.. ఏంటి అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ మధ్య ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన అఖండ, వీరసింహరెడ్డి హిట్ల తర్వాత భగవంత్ కేసరి సినిమాతో ప్రస్తుతం బిజిగా గడుపుతున్నారు. ఇక ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. దానికి కారణం చంద్రబాబు అరెస్టు.. బాలయ్య బిజిగా రాజకీయాల్లో ఉండటమే. అయితే దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. సినిమా అనుకున్న టైంకే రిలీజ్ అన్నట్లు చెప్పుకొచ్చింది.

ఇక ఈ భగవంత్ కేసరి సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. కాజల్ ఆగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక కూతురి పాత్రలో శ్రీలీల నటించింది. అయితే ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా.. ఇప్పటికే రిలీజ్ అయిన గణేశ్ అంథెం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా అనుకున్నట్లుగానే దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ తో బాలయ్య బాబు పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు.
ఆ విషయం పక్కన బెడితే.. బాలయ్య తన తదుపరి సినిమా దర్శకుడు బాబీతో చేయనున్నాడు. ఈ సినిమా బాలయ్య బర్త్ డే సందర్భంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇది పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో మరో హీరో నటిస్తాడని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

బాలయ్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ఆయన పక్కన నటించాలని చాలా మందికి కోరిక ఉంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం.. ముగ్గురు హీరోయిన్లను అనుకుంటున్నారట. ఇప్పటికే నయనతార, అనుష్క వంటి వారిని తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తుందట. నయనతారా బాలయ్యతో చాలా సినిమాల్లో నటించింది. అనుష్కకూడా ఓ సినిమాలో నటింటింది.

ఈ సారి కొత్త వారిని తీసుకుంటే.. బాగుంటుదని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అందుకోసం.. మిల్కీ బ్యూటీ తమన్నా పేరు వినిపిస్తుంది. ఈ బ్యూటీ ఇప్పటివరకు స్టార్ హీరోల సరసన నటించింది కానీ బాలయ్యతో ఇప్పటి వరకు సినిమా చేయలేదు. ఇప్పటికే గతంలో బాలయ్యతో నటించాలని ఉన్నట్లు మిల్కి బ్యూటీ చెప్పుకొచ్చింది. మరి ఈసారి బాలయ్య సినిమాలో మిల్కీ బ్యూటీని తీసుకుంటే... కెమిస్ట్రి వెరే లెవెల్ అంటున్నారు. అలా బాలయ్య సినిమాకోసం ముగ్గురు బ్యూటీలు పోటీ పడుతున్నారని నెట్టింట ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాలో ఏ హీరోయిన్ ఫిక్స్ అవుతుందోనని..


Click it and Unblock the Notifications











