NBK 109: వెండితెరపైకి క్రేజీ హిట్ కాంబినేషన్.. ఆ హీరోయిన్ తో మరోసారి బాలయ్య!
నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలను లైన్లో పెడుతూ నేటి తరం యువ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు అని చెప్పవచ్చు. గతంలో కాస్త నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన బాలయ్య ఈసారి మాత్రం అసలు వేగాన్ని తగ్గించడం లేదు. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన భారీ స్థాయిలో ఓపెనింగ్స్ కూడా అందుకుంటున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సినిమా 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆ సినిమా అనంతరం బాలయ్య బాబు మరో క్రేజీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న 108వ సినిమాపై కూడా అంచనాలో గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్తో పాటు భగవంత్ కేసరి అనే టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

అయితే బాలయ్య ఆ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చాడు. NBK 109వ సినిమాను బాలయ్య మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్న బాబి ఇప్పుడు బాలయ్య బాబుతో కూడా మరో మాస్ మసాలా యాక్షన్ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడు.
ఈ సినిమాను సీతార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మరోసారి హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. బాలయ్య బాబుతో సింహ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నయనతార వెంటనే శ్రీరామ రాజ్యం, జై సింహా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

ఆ మూడు సినిమాలు కూడా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ని అందుకున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి NBK 109వ సినిమాలో కూడా ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. నయనతార కూడా దర్శకుడు బాబి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











