నయనతార కోరిక తీరుస్తున్న ప్రభుదేవా
బాలీవుడ్ లో నయనతార ఎంట్రీ ఇవ్వబోతోంది. అదీ తనకు కాబోయే భర్త ప్రభుదేవా డైరెక్షన్ లో. తెలుగు ఎస్ ఎస్ రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించి సూపర్ హిట్ చేసిన 'విక్రమార్కుడు" హిందీలోకి అక్షయ్ కుమార్ హీరోగా రౌడీ రాథోరో" రూపొందుతోన్న సంగతి విదితమే. ఈ సినిమాలో 'విక్రమ్ సింగ్ రాథోడ్" పాత్రకు జోడీగా నయనతార కన్పించబోతోందని సమాచారం. తెలుగులో ఈ పాత్ర లేకపోయినా, హిందీలో మాత్రం నయనతార కోసమే ప్రభుదేవా స్క్రిప్ట్ లో చిన్న 'మార్పు" చేసినట్టు తెలుస్తోంది.
తెలుగు 'పోకిరి"ని హిందీలో 'వాంటెడ్"గా తెరకెక్కించి దర్శకుడిగా బాలీవుడ్ లో బోణి కొట్టిన ప్రభుదేవా, ఈసారి 'రౌడీ రాథోర్" తో మరింత పెద్ద సక్సెస్ సొంత చేసుకుంటాననే ధీమాతో వున్నాడు. మొత్తమ్మీద, చాన్నాళ్ళుగా నయనతారను బాలీవుడ్ కి పరిచయం చేసేందుకు నానా తంటాలూ పడ్తోన్న ప్రభుదేవా 'రౌడీ రాథోర్ సినిమాతో నయనతార బాలీవుడ్ కోరికను తీర్చబోతున్నాడన్నమాట.
అయితే టాలీవుడ్ లో నయనతార శ్రీరామ రాజ్యం చివరి సినిమా అని ఇక తను సినిమాలలో నటించదని ప్రభుని పెళ్ళి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలని. తన డ్యాన్స్ స్కూల్ చూసుకొంటుందని వచ్చి వార్తలకు తిలోదకాలు వదిలినట్టేనా...?ప్రభుదేవా తన భార్యరామ్ లత్ కు ఇచ్చిన మూల్యాన్ని తిరిగి సంపాదించాలంటే నయనతార సినిమా బిజినెస్ చేయాల్సిందేనా...?అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి....


Click it and Unblock the Notifications











