నయనతార కన్నీటి వెనుక అసలు కథ ఏంటి..?
తనకు గుర్తింపు, కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టిన సినీపరిశ్రమను వీడలేక భళ్ళున ఏడ్చేసిన సన్నివేశం నయనతార జీవితంలో జరిగింది. రామాయణంలో సీతతో పోల్చడం సబబు కాకపోయినా... ఆ పాత్రను పోషిస్తుంది కనుక పోల్చడం సబబే. ఆనాడు అయోధ్య వదలి తన భర్తతో వనవాసం వెళ్ళిన సీత ఆనందంగానే వెళ్ళింది. అయితే అత్తమామలు, ఊరి జనాలకోసం ఆమె వెళుతుంటే ఊరూరా విషన్న వదనాలతో సాగనంపుతుంటే ఒక్కసారి సీత కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇప్పుడు అదే పరిస్థితి నటి నయనతారకు కలిగింది. ఇక తాను ఇటువంటి వాతావరణానికి దూరంగా ఉంటానేమోనని తలచుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది.
'శ్రీరామరాజ్యం' షూటింగ్ ముగింపు రోజునాడు ఆమెను ఓదార్చడం ఎవ్వరి తరంకాలేదు. బాపు వంటి అగ్రదర్శకుల దర్శకత్వంలో బాలకృష్ణ వంటి కథానాయకుడి పక్కన సీతగా నటించే అవకాశం రావడం అదృష్టంగా చెప్పుకుంది. షూటింగ్ ముందు ప్రభుదేవాతో పెండ్లి అనే వార్త నేపథ్యంలో 'సీత'గా ఈమె పనికిరాదంటూ పలువురు విమర్శలకు దిగారు. అది సినిమావరకే పరిమితం అని స్టేట్‌మెంట్ ఇవ్వడంతో కాస్త సద్దుమణిగింది. ఎక్కడో చిన్న పాత్రలు వేసుకునే నయతార రజనీకాంత్ చంద్రముఖి ద్వారా గుర్తింపు పొందింది. ఆ తర్వాత తెలుగులో అగ్రహీరోల సరసన నటించింది.
పెండ్లి తర్వాత ఇక నటించకూడదని ప్రభుదేవా చేసిన ఒత్తిడి మేరకు తనకిష్టం లేకపోయినా దూరంగా ఉంటుందా? అనే అనుమానం శ్రీరామరాజ్యం ముగింపురోజు ఆమె మొహంలో కన్పించాయి. మొదటి భార్యను వీడి నయనతారను పెండ్లి చేసుకుంటున్న ప్రభుదేవా ఎంతబాగా చూసుకుంటారో వెయిట్ అండ్ సీ


Click it and Unblock the Notifications











