నయనతార రోజు రేటు ఎంతంటే...
అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం నయనతార రెమ్యునేషన్ రోజుకి రెండు లక్షలుని తేలింది. తాజాగా ఆమె చేస్తున్న ఆంజనేయులు చిత్రం కోసం ఆమె ముఫ్పై ఐదు రోజులకి డభ్బై లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఇంతకు ముందు సినిమాకు డేట్స్ తో సంభందం లేకుండా కోటి అడిగిన ఆమె వరస ఫ్లాఫ్ లు రావటంతో తగ్గించింది. తన తోటి హీరోయిన్స్ కన్నా పై మెట్టులో ఉండటం ముఖ్యమని, అలాగే ఎప్పుడూ మినిమం రెండో, మూడు చిత్రాలు చేతిలో ఉండటం గొప్ప అని అంతేగాని ఈ ఆర్ధిక మాధ్యం సమయంలో డబ్బు కోసం పట్టుపట్టడం అసమంజసం అంటోంది. అదేంటి తమిళంలో డబ్బుకోసం పట్టు పట్టావు కాబట్టే కదా నీ మీద బ్యాన్ దాకా వెళ్లారు అంటే అది పరువు ప్రతిష్టలుకి సంభందించిన వ్యవహారం అంది. అయినా నేనే క్షమాపణ చెప్పి అడ్వాన్స్ పే చేసాను కదా అని కోపంగా చెప్పింది. అలాగే ఎన్టీఆర్ తో చేస్తున్న అదుర్స్ చిత్రానికి కూడా నయనతార గట్టిగానే వసూలు చేసినట్లు సమాచారం. వినాయిక్ ప్రత్యేక అభిమానంతో ఆమెను సినిమాలోకి తీసుకోవటమే కాకుండా రెమ్యునేషన్ సైతం భారీగానే ఇప్పించాడని వినపడింది.


Click it and Unblock the Notifications











