ఎస్కేప్ అయిన నయనతార
సినీనటి నయనతార ఎస్కేప్ అయింది. కాలం, పరిస్థితులు ఆమెకు కలిసి రావడంతో నయన హాయిగా జారుకుంది. కన్నడ దర్శక నిర్మాతల మాదిరి, తమిళ దర్శక నిర్మాతలు కూడా ఆలోచించి ఉంటే నయన తార ప్రస్తుతం ఇంత సుఖ పడేది కాదేమో. ఇంతకీ ఏ విషయంలో ఎస్కేప్ అయిందనే కదా మీ డౌట్. ఆ విషయానికే వస్తున్నాం....
దక్షిణాది సినీనటి నిఖిత కన్నడ సూపర్ స్టార్ దర్శన్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందనే విషయం బహిరంగ రహస్యమే. నిఖిత తన కాపురంలో నిప్పులు పోస్తోందటూ దర్శన్ భార్య పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ క్రమంలో భార్యపై దాడి చేసిన దర్శన్ హత్యా యత్నం కేసులో జైలు పాలయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో కన్నడ సినీ పరిశ్రమ దీనంతటికీ మూల కారణమైన హీరోయిన్ నిఖితపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.
కొన్ని రోజులు వెనక్కి వెళితే...నయన తార కూడా ఇదే బాపతు. వివాహితుడైన ప్రభుదేవాతో ఆమె ప్రేమ బంధం నడిపింది. పచ్చిగా చెప్పాలంటే అక్రమ సబంధం. ఫలితంగా ప్రభు దేవా కాపురంలో నిప్పులు. నయన వ్యవహారంతో ప్రభుదేవా తన మొదటి భార్య రమాలత్ కు విడాకులు ఇచ్చి వదిలించుకున్నాడు. పాపం రమాలత్ తన పిల్లలతో ఒంటరిగా గడుపుతోంది.
రమలత్, తమిళ దర్శక నిర్మాతలు...నిఖిత మాదిరి, నయనతార విషయంలో ఆలోచించి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి చోటు చేసుకునేది కాదేమో? రమాలత్ జీవితం అలా ఆగం అయ్యేది కాదేమో? అనే చర్చ తమిళ సినీవర్గాల్లో సాగుతోంది.


Click it and Unblock the Notifications











