హాట్ స్టార్ నయనతారకు తెలంగాణా భయం?

By Srikanya

మళయాళి బ్యూటీ నయనతారకు ఈ తెలంగాణ ఇష్యూ మొదలైన దగ్గరనుంచీ టెన్షన్ పట్టుకుందని సమాచారం. పొలిటికల్ గా ఆమెకు ఆసక్తి లేకపోయినా ఆమె ఆస్తులు కొన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద ఉండటమే ఈ టెన్షన్ కు కారణమంటున్నారు. అక్కడ ఆమె సినీ పరిశ్రమలోని కొందరి సన్నిహితుల సహకారంతో కొన్ని భూమలు కొంది. మంచి రేటు వస్తే అమ్మి బాగుపడదామని ఎదురుచూస్తోంది. అయితే గత సంవత్సరకాలంగా రియల్ ఎస్టేట్ వేడి లేకపోవటంతో అమ్మలేదు. తాజాగా ఆమె తెలంగాణ ఇష్యూ స్టార్టవగానే అమ్మి వదిలించుకుందామనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఇప్పుడు కొనేవారు కనపడటం లేదుట.

అంతేగాక నయనతార కొన్న రేటులో సగం కూడా బేరం రావటం లేదని చెప్తున్నారు. ఆమె చేత కొనిపించిన సన్నిహిత దర్శకుడు ఈ టాపిక్ పై అస్సలు మాట్లాడటం లేదని తెలుస్తోంది. దాంతో వాటిని ఎలా వదిలించుకోవాలా అని రియల్ ఎస్టేట్ చూసే కొందరు హీరోలకు పోన్స్ చేస్తోందని చెప్తున్నారు. అయితే ఈ గొడవలు ఆగేదాకా ఆగమని వారు సలహాలు ఇస్తున్నారని చెప్తున్నారు. అందులోనూ ఆ భూములు ఆమె పేర లేకుండా బినామీ పేర్ల మీద ఉన్నాయని,రేపు తెలంగాణా వస్తే మరింత రేట్లు పడిపోతాయని ఆమెకు బెంగపట్టుకుంది. దాంతో ఎప్పటికప్పుడు ఆసక్తి లేకపోయినా టీవీ వార్తుల తెలిసికుంటోందని వినికిడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X