'సింహా' చిత్రంలో నయనతార నిషేధం!
రోజుకో కొత్త భామ అన్ని వుడ్ లలో పరిచయం అవుతుంటే ఇప్పటి వరకు పెత్తనం చేసిన వారు సరైన పారితోషయం లేక తమ నిలకడను కాపాడుకోవడానికి అనేక దారులు వెతుక్కుంటున్నారు. ఆ మద్యన పారితోషికం విషయంలో నయనతార పై కోటివుడ్ లో నిషేధం విధించారు. అయితే ఆ తర్వాత నయనతార కళ్లబేరానికి రావడంతో ఆ నిషేదాన్ని తొలగించారు. తాజాగా 'సింహా" చిత్రానికి సంబంధించినంత వరకూ నయనతారపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే 'సింహా" పోస్టర్లలో ఎక్కడా నయనతార కనబడడం లేదు. ఈ విషయమై నయనతారకు వీరాభిమాని అయిన చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను నిర్మాతతో ఎంత ఫైట్ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పుకుంటున్నారు. కావాలంటె పోస్టర్ల మీద నీ ఫోటో వేయమన్నా వేస్తా కాని..నయనతార ఫోటో మాత్రం వేయం" అని నిర్మాత కరాఖండీగా చెప్పేసాడంట. ఆ మాటకు కట్టుబడి బోయపాటి శ్రీను ఫోటోలు ప్రతి పోస్టర్ పై ప్రముఖంగా వేస్తున్నారని సమాచారం.
అయితే సింహా సినిమా స్టిల్స్ లో నయనతారను చూస్తున్నవాళ్లంతా తన ముందే పెదవి విరుస్తుండడంతో పోస్టర్ల పై నయనతారను నిషేదించి..నమిత, స్నేహ ఉల్లాల్ స్టిల్స్ ను మాత్రమే ఉపయోగించవలసిందిగా పబ్లిసిటీ డిజైనర్స్ కు నిర్మాత కచ్చితమైన ఆదేశాలిచ్చాడని సమాచారం అందుతోంది.


Click it and Unblock the Notifications











