»   »  తెలుగులోనూ నయనతార బికిని సీను?

తెలుగులోనూ నయనతార బికిని సీను?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nayantara
రూమరో... రియల్ న్యూసో గాని 'భిల్లా' రీమేక్ లో రవితేజా సరసన చేయటానికి నయనతారని ఎప్రోచ్ అవుతున్నారనే వార్త ఫిల్మ్ నగర్ లో గుప్పుమంది. 'భిల్లా' లో నయనతార బికినీ లో దర్శన మిచ్చి తమిళులని తన వైపు నుంచి కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేసింది. దాంతో ఆ ఒక్క సీను కోసమే అక్కడు అరవ అభిమానులు ఎగబడి వచ్చారట. మరి తెలుగులో ఆ రేంజి సెక్స్ పోజింగ్ చేసేదెవరు. అని ఎన్నో ఆప్షన్లు చూసినా ఎవరూ ఆనటంలేదట. నయనాందకరమైన నయనతార అందచందాల ముందు వాళ్ళంతా తేలిపోతున్నారట. దాంతో దర్శకుడిగా ఎంచుకున్న మెహర్ రమేష్ కూడా వేరే ఆలోచన లేకుండా ఆమె అయితెనే బెటర్ అని నిర్ణయానికి వచ్చేసాడుట. అలాగే రవితేజ,నయనతార చేసిన దుబాయి శీను హిట్టవటం కూడా ఈ ఆలోచలనలకు ప్లస్ అవుతున్నాయి. కాబట్టి ఈ వార్త నిజమవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X