నిత్యానంద నుండి నయనతారకు పిలుపు?

By Bojja Kumar

హైదరాబాద్: వివాదాస్పద స్వామీజీ నిత్యానంద గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిత్యానంద, రంజిత వ్యవహారం గురించి తెలియని వారు ఉండరు. అయితే స్వామి నిత్యానంద పేరు మరోసారి వార్తల్లో మారు మ్రోగుతోంది. నిత్యానంద ఆశ్రమం నుండి ప్రముఖ సౌతిండియా హీరోయిన్ నయనతారకు ఫోన్ వెళ్లిందనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

ఆ మధ్య ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపిన నయనతార....కొన్ని కారణాల వల్ల అతని నుండి విడిపోయింది. ఈ వ్యవహారంతో ఆ మధ్య చాలా మెంటల్ టెన్షన్ కు గురైంది. కొంత కాలం పాటు సినిమాలు దూరం అయింది. ఆ సమయంలో నిత్యానంద ఆశ్రమం నుండి నయనతారకు ఫోన్ కాల్ వచ్చిందట.

Nayantara invited by Nityananda to Ashram ?

స్వామి నిత్యనందుడి బోధనలు సమస్యల్లో ఉన్న వారికి మనశ్శాంతిని కలిగిస్తాయని, ఆశ్రమానికి వచ్చి మనశ్శాంతి పొందాలని ఆమెను కోరారట. అయితే అప్పటికే నిత్యానంద వివాదాల్లో ఉండటంతో ఆశ్రమానికి వెళ్లడానికి నిరాకరించిందట నయనతార. ఈ విషయం బయటకు ఎలా పొక్కిందో తెలియదు కానీ ఇది సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఒక వేళ నయనతార ఆశ్రమానికి వెళ్లి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో..?

నయనతార సినిమాల గురించిన వివరాల్లకి వెళితే...తెలుగులో చివరగా అనామిక చిత్రంలో నటించిన ఆమె ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ‘ఐదు నమ్మ ఆలు', ‘నాన్ బెండ', ‘తాని ఒరువన్', ‘మాస్' అనే తమిళ చిత్రాల్లో నటిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తన గ్లామర్, పెర్ఫార్మెన్స్ తో టాప్ పొజిషన్లో కొనసాగుతుండటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X