ప్రభు దేవాను చిక్కుల్లో పడేసిన నయనతార
నయనతార లెక్కకు మిక్కిలి ఖర్చులు ప్రభుదేవాను ఇరుకున పడేస్తున్నాయట. ఖర్చులు తగ్గించుకోవాలని, లైఫ్ స్టయిల్ మార్చుకోవాలని ప్రభుదేవా నెత్తీ నోరు బాదుకుని చెప్పినా ఆమె వినడం లేదని సినీ పరిశ్రమ టాక్. నయన తార తీవ్రమైన ఆర్థిక చిక్కుల్లో పడినట్లు చెబుతున్నారు. తన నాలుగు కార్ల ఇఎంఐలు (నెలవారీ వాయిదాలు) కూడా చెల్లించలేని స్థితిలో పడిందట. డబ్బుల కోసం ఆమె పూర్తిగా ప్రభు దేవా మీద ఒరిగిపోయినట్లు చెబుతున్నారు. ఆమెను ఆర్థిక చిక్కుల నుంచి బయటపడేయడానికి పది లక్షల రూపాయల అప్పులు కూడా అతను తీర్చాడని అంటున్నారు.
తన బిల్లులు చెల్లిస్తే తప్ప తాను కొచ్చిన్‌లో మారకూడదని ప్రభుదేవాతో ఆమె పట్టుబట్టిందని అంటున్నారు. దాంతో అతను అప్పులు తీర్చాడని అంటున్నారు. ఎన్టీఆర్ సరసన నటించేందుకు ఆమె రూ. 1.5 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సినిమాతో పాటు వెంకటేష్ సినిమాలో నటించేందుకు ఆమె ఇష్టపడుతున్నట్లు చెబుతున్నారు. ఆ సినిమాలను వదులుకోవడానికి ఆమె ససేమిరా అంటోందని సమాచారం. పెళ్లి వాయిదా పడిందనే వార్తలు రాగానే నలుగురు టాప్ ప్రొడ్యూసర్స్ ఆమె కాల్షీట్ల కోసం అడిగారు. అయితే వాటిని ఆమె తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











