నయనతారకి ‘పుకెట్’ అంటే చాలా ఇష్టం
మాయలఫకీర్ ప్రాణం ఎక్కడ ఉంటుందంటే ఏడు సముద్రాల అవతల ఒక మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకలో అన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడ అందమైన లొకేషన్లు ఉంటే అక్కడికి మన తెలుగు సినిమా దర్శక, నిర్మాతలు,యునిట్ సభ్యులు వాలిపోతుంటారు. హీరో హీరోయిన్స్ సినిమా షూటింగ్ లకోసం విదేశాలకు వెళుతుంటారు. అక్కడ కొత్త కొత్త ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ప్రదేశాలు సంచరించడం కొంత మంది తారలకు తీపి జ్ఝాపకాలను గుర్తుండుపోతాయంటారు. అయితే మరికొందరికి మాత్రం ప్రకతి వైపరీత్యాల వల్ల ఊహించని సంఘలనలు ఎదురవుతాయి.
రీసెంట్ గా తమన్నా భూకంపం అలాంటి చేదు అనుభవానికి గురైంది. ఒక సారి షూటింగ్ కోసం బ్యాంకాక్ వద్ద 'పుకెట్" దీవికి షూటింగ్ కోసం నయనతార ను తీసుకువెళ్ళారట. ఆ రోజు షూటింగ్ పూర్తిచేసుకొని హొటల్ కి వచ్చాక మరుసటి రోజు షాకింగ్ న్యూస్ ఎదురైందట. పుకెట్ దగ్గరలోని మరొక దీవిలో సునామీ వచ్చి ఆ దీవి మొత్తం మునిగి పోయిందట. ఒక్క ఐదునిమిషాల్లో జరిగిన ఆ భీభత్సం పుకెట్ దీవిని కూడా తాకిందట. ఆ సునామీ రెండు గంటల ముందు వచ్చి ఉంటే నేను ఏమైపోయేదాన్ని అని తలుచుకున్నప్పుడల్లా భయంతో వణికొపోయేదట. అయినా అక్కడ షూటింగ్ అంటే మాత్రం చాలా ఇష్టం అంటోంది నయనతార.


Click it and Unblock the Notifications











