నయనతార పుట్టుమచ్చను బాపు వద్దని...
నయనతార క్రింద పెదవి క్రింద ఉండే పుట్టు మచ్చ చాలా సెక్సీగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే శ్రీరామ రాజ్యం సినిమాలో ఆ పుట్టుమచ్చ కనిపించదు. శ్రీసాయిబాబా మూవీస్ పతాకం కింద నిర్మిస్తున్న 'శ్రీరామజ్యం'లో నయనతార సీతగా నటించారు. బాలకృష్ణ రాముని పాత్ర పోషించారు. బాపు దర్శకత్వం వహించారు. అయితే షూటింగ్‌లో చిన్న ఇబ్బంది ఏర్పడింది. నయనతార కిందిపెదవిపై పుట్టుమచ్చ ఉంది. అదంటే ఆమెకు భావోద్వేగంతో కూడిన ఇష్టం. కాని అది ప్రేక్షకులకు రెచ్చగొట్టే భావనలు కలిగిస్తుందని బాపు అభిప్రాయపడ్డారట. తీసేయమని తారను కోరారు. కాని ఆమె అందుకు అంగీకరించలేదుని తెలిసింది. చివరికి గ్రాఫిక్స్ సాయంతో సినిమారీ ళ్లలో తీసేస్తామని చెప్పగా ఆమె అంగీకరించిందని సమాచారం.
బాలకృష్ణ, నయనతార రెండవసారి జంటగా నటించిన 'శ్రీరామరాజ్యం' చిత్రం విడుదల వాయిదా పడినట్టు తెలిసింది. నిజానికి ఆ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ మాసంలో విడుదల కావాల్సింది. కానీ ప్రస్తుతం అది అక్టోబర్ ఆరవతేదీకి వాయిదా పడినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వాయిదా వెనుక కారణాలను చిత్ర రూపకర్తలు వెల్లడించలేదు. 'శ్రీరామరాజ్యం' చిత్రంలో బాలకృష్ణ శ్రీరామచంద్రునిగా, నయనతార సీతగా నటించారు. బాపు, రమణ ద్వయం చివరిసారిగా రూపొందించిన చిత్రరాజమిదే. ఆ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల భద్రాచలం వద్ద జరిగింది.


Click it and Unblock the Notifications











