twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ...సీన్లు లేకుంటే నయనతార ఉండీ దండగే?

    By Bojja Kumar
    |

    చెన్నై: తమిళ హీరో శింబు, నయనతార మధ్య అప్పట్లో ఎంత ఘాటు ప్రేమాయణం సాగిందో ఇపుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెరపై రొమాన్స్ పండించడంతో పాటు...తెర వెనక రియల్ లైఫ్‌లో వీరి మధ్య సరసాలు సాగాయి. అప్పట్లో వీరు రహస్యంగా రాసలీల సాగిస్తూ ముద్దుల్లో మునిగి తేలిన ఫోటోలు ఇంటర్నెట్లో లీకై పెను సంచలనమే సృష్టించాయి.

    నయనతార-శింబు కలిసి నటించిన వల్లభన్(తెలుగులో 'వల్లభ') చిత్రంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా ఏళ్ల క్రితమే విడిపోయిన ఈ ప్రేమజంట తాజాగా మళ్లీ పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలో మళ్లీ కలిసి నటిస్తుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందుకు తగిన విధంగానే ఈ సినిమాలోనూ వీరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా దర్శకుడు ప్లాన్ చేసాడు.

    తాజాగా తమిళ సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం....హాట్ అండ్ సెక్సీ సీన్లు చేయడంలో ఆరి తేరిన నయనతార....మాజీ ప్రియుడితో అలాంటి సీన్లు చేయడాని ఒప్పుకోవడం లేదట. ముందస్తుగానే దర్శకుడికి అలాంటి సీన్లు వద్దు, ఇలాంటి సన్నివేశాలు శింబుతో చేయను అంటూ కండీషన్లు పెడుతోందట. మసాలా సీన్లు చేయడానికి నో చెబితే ఆమె శింబుతో నటించి దండగే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    ఇటీవల ఓ తమిళ సినిమాకు సంబంధించి హీరోయిన్ నజ్రియా హాట్ సీన్లు విషయంలో రచ్చరచ్చ చేసిన నేపథ్యంలో..........నయనతార స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కామనే, వాటికి అడ్డు చెబితే ఎలా? అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అపుడు ఆవిడను అలా అన్న నయనతార ఇపుడు శింబుతో అలాంటి సీన్లు చేయడానికి కండీషన్లు పెట్టడం తగునా?

    English summary
    After 7 long years, Simbu and Nayanathara are pairing up once again for a film. This Tamil movie is being directed by Pandiraj and the first schedule of the film has already been completed. However sources say Nayan is nipping Simbu's advances though director is planning to shoot romantic scenes starting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X