‘రౌడీ’కి ముందే ప్రభు-నయన ఎంజాయ్
ప్రభుదేవా, నయన తారలు ప్రస్తుతం ముంబైలో తిష్ట వేశారు. హిందూ మతంలోకి మారిన తర్వాత తన స్వస్థలం కోచి వెళ్లిన నయన అక్కడి నుంచి నేరుగా ముంబై చేరుకుంది. ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా జంటగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ 'రౌడీ రాథోడ్"(తెలుగులో విక్రమార్కుడు) షూటింగ్ ప్రారంభ కానున్న నేపథ్యంలో ప్రియుడికి మోరల్ సపోర్టు ఇవ్వడానికి వచ్చిందట. సినిమా షూటింగ్ ప్రారంభ అయ్యాక ప్రభుదేవా చాలా బిజీ అయిపోతాడు. తర్వాత అయనతో ఏకాంతంగా గడపం కుదరదు కాబట్టి అంతకు ముందే ప్రియుడు ప్రభుదేవాతో తనివి తీరా ఎంజాయ్ చేస్తోంది.
సినిమా సూటింగ్ పూర్తయ్యాక....మంచి ముహూర్తం చేసుకుని పెళ్లి చేసుకుని హనీమూన్ చెక్కేయ్యడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఈ సినిమా జంట.


Click it and Unblock the Notifications











