సార్ వస్తారూ...అనేది నయనతారేనా?
మహేష్ బాబు బిజినెస్‌మేన్ సినిమాలోని 'సార్ వస్తారూ' అనే పాటనే రవితేజ హీరోగా రూపొందుతున్న చిత్రానికి టైటిల్‌గా పెట్టాలనే ఆలోచలో దర్శక నిర్మాతలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ బేనర్‌పై ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. యువత, సోలో చిత్రాలు దర్శకత్వం వహించిన పరశురాం ఈచిత్రానికి దర్శకుడు.
ఈ చిత్రంలో కథానాయికగా నయనతార పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. గతంలో రవితేజ, నయనతార, పరశురాం కాంబినేషన్లో 'ఆంజనేయులు' చిత్రం రూపొందింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సారి ఆ తప్పు జరగకుండా సేమ్ టీమ్‌తో హిట్ కొట్టాలనే కసితో దర్శకుడు పరశురామ్ ఓ పూర్తి ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. జూలైలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
ప్రస్తుతం రవితేజప పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ఇందులో రవితేజ సరసన ఇలియాన నటిస్తోంది. పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నాడు క్రేజీ డైరెక్టర్ పూరి.
నయనతార ప్రస్తుతం గోపీచంద్ సరసన భూపతి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తోంది. నిర్మాత తాండ్ర రమేష్ జయ బాలాజీ రియల్ మీడియా పతాకంపైన కొమర వెంకటేష్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెలలోనే ఈచిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయింది.


Click it and Unblock the Notifications











