నయనతార అలా కనిపించదా?

By Staff

Nayantara
సౌత్ ఇండియాలో హాట్ స్టార్ ఎవరంటే ఆలోచించకుండా నయనతార అని చెప్పేలా పాపులర్ అయిన అందం ఆమెది. ఇప్పుడు ఆమె అభిమానులకు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. తాజాగా ఆమె ఓ సినిమాలో స్పెషల్ డాన్స్ కి కమిటయ్యింది. దాంతో వారంతా ఆనంద పడ్డారు. కాని అందులో ఆమె ఎలా కనిపిస్తుందో అన్న బెంగ పట్టుకుంది వారికి. ఎందుకంటే ఆ సినిమా మళయాళ చలన చిత్ర సంఘం అభివృద్ధి కోసం తీస్తున్న'ట్వంటి ట్వంటి' కావటం. ఆసలు ఇప్పుడు సినిమా మొత్తం ఆమె కనిపించుకున్నా ఒక్కపాటలో కనిపించినా చాలనే పరిస్థితి కొచ్చింది దక్షిణాది సినీ పరిశ్రమ. అందులోనూ ఆమె మొహమాటం లేకుండా ఈమధ్య ప్రతి చిత్రంలోను ఎక్స్‌ఫోజింగ్‌కు సై అనటం మరో ప్లస్ అయ్యింది. ఆ మధ్య తమిళంలో అజిత్ హీరోగా నటించిన 'బిర్లా' చిత్రంలో బికీనీ డ్రెస్‌తో కనిపించిన సీన్ల కోసమే సినిమా సగం రోజులు ఆడిందిట. దాంతో రజనీ కాంత్ 'కుచేలన్' సినిమాలో సైతం ఆమె అలా మెరుపులా కనిపించి మురిపించటానికి అవకాశం వచ్చింది.ఇప్పుడు అదే రూటులో నయనతారకు ఈ ఆఫర్ వచ్చింది.

అదీ మాతృభాష అయిన మలయాళంలో కావటంతో డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తానంది. అక్కడి చలన చిత్ర సంఘం అభివృద్ధి కోసం తీస్తున్న ఆ చిత్రంల కోసం ఓ ప్రత్యేక పాటలో నర్తించమని అడిగారుట. ఈ విషయం బయిటకు వచ్చిన దగ్గరనుండి మలయాళ చిత్రసీమలో అందరూ ఆ విషయమే మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమాకు ప్రత్యేక మైన క్రేజ్ కూడా వచ్చింది.ఇక అభిమానులైతే ఇంకొంచెం ముందుకెళ్ళి బిర్లా తరహాలోనే ఆమె బికినీతో కన్పిస్తుందా అంటూ ఆరా తీస్తున్నారట. అయినా ప్రత్యేక సాంగ్ అనగానే కామన్ గానే అందాల ఆరబోత ఉంటుంది. ఇక నయనతార అయతే నయనాందం గ్యారింటి అని అభిమానులు ఉత్సాహపడుతున్నారుట. కాని అనుకోకుండా ఇక్కడో ట్విస్టు పడింది. ఈ చిత్రంలో నటించే నటులెవరకి కూడా పారితోషికం ఇవ్వరు. మరి పారితోషికం తీసుకోని చిత్రంలో నయనతార అందాల ప్రదర్శన చేస్తుందా అని అనుమానం బయిలుదేరింది. దాంతో వారు నిద్రలకు దూరం చేసుకుంటున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X