బాలకృష్ణ తో నయనతార కమిట్ అవటానికి కారణం
బాలకృష్ణ తో చేయటానికి నయనతార కమిటయ్యందని సమాచారం. బోయపాటి శీను,బాలకృష్ణ కాంబినేషన్లో రెడీ అవుతున్నసింహా చిత్రం కోసం ఆమెను అడిగారు. అయితే ఇంతకుముందే ఆ చిత్రంలో నమిత, స్నేహా ఉల్లాల్ ఉన్నారు. దాంతో ఆమె మూడో హీరోయిన్ స్ధానంలో బుక్ అయినట్లయింది. ఇక బాలకృష్ణ,నయనతార కాంబినేషన్ తొలిసారి కావటంతో మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బోయపాటి శ్రీనుతో గతంలో తులసి చిత్రానికి చేసి ఉండటంతో తన పాత్ర చిన్నదయినా కాదనలేక డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో సినిమాలు లేకపోవటం కూడా మరో కారణంగా చెప్తున్నారు. ఇక నయనతార,ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న అదుర్స్ క్రిసమస్ రోజున రిలీజ్ కానుంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రలలో నటించి నవ్వించనున్నారు. వివివినాయిక్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని కొడాలి నాని, వల్లభనేని వంశీ కలసి నిర్మిస్తున్నారు. అలాగే భద్ర,తులసి అనంతరం బోయపాటి డైరక్ట్ చేస్తున్న చిత్రం సింహా. బాలకృష్ణ ..మిత్రుడు పరాజయం అనంతరం చేస్తున్న సినిమా ఇది. సంక్రాంతికి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











