పెళ్లి కానుకగా నయన్ కోసం విగ్నేష్ శివన్ ఖరీదైన కానుక.. అంతకుమించి నయన్ రిటర్న్ గిఫ్ట్?
తమిళ చిత్ర పరిశ్రమలో మొత్తానికి మరొక కొత్త జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఎప్పటి నుంచో సస్పెన్స్ గా కొనసాగుతూనే ఉన్న నయన్ విగ్నేష్ పెళ్లి ఎట్టకేలకు జరగబోతోంది. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం మరొక కొత్త టాపిక్ కూడా వైరల్ అవుతోంది. పెళ్లి సందర్భంగా దర్శకుడు విగ్నేష్ తనకు కాబోయే భార్య కోసం ఖరీదైన కానుక ఇచ్చాడట. అయితే అంతకుమించి నయనతార అతనికి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

స్పెషల్ క్రేజ్
గ్లామరస్ హీరోయిన్ గా గత 15 ఏళ్లకు పైగా సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా కొనసాగుతున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లొ నయనతార ఒకరు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఎప్పుడూ ఒకేలా కనిపించే నయనతార తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది అనే చెప్పాలి. కేవలం అగ్ర హీరోలతో మాత్రమే కాకుండా రీసెంట్ గా వచ్చిన యువ హీరోలతో కూడా ఆమె సినిమా చేసేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు.

మొత్తానికి పెళ్లి ఫిక్స్ అయ్యింది
హీరోయిన్ గా తన స్థాయిని పెంచుకునే విధంగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన నయనతార పర్సనల్ లైఫ్ లో మాత్రం కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక గతంలో ఆమె లవ్ బ్రేకప్స్ ఎంత బాధ పెట్టినప్పటికీ కూడా మొత్తానికి విగ్నేష్ తో లవ్ ట్రాక్ మాత్రం పెళ్లి పీటల వరకు వెళుతోంది. ఈనెల 9వ తేదీన మహాబలిపురంలో గ్రాండ్ గా వీరి వివాహం జరగబోతున్న ట్లు తెలియజేశారు.

అగ్ర హీరోలకు ఆహ్వానం
ఇప్పటికే విగ్నేష్ నయనతార ఇద్దరూ కలిసి కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులను కూడా ప్రత్యేకంగా కలుసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే తమిళ అగ్ర హీరోలకు కూడా ఇన్విటేషన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. కొంతమంది సినీ దర్శకులు నిర్మాతలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నయన్ కు కానుకలు
అయితే నయనతార ను పెళ్లి చేసుకోబోతున్న దర్శకుడు విగ్నేష్ ఆమె కోసం ఒక ప్రత్యేకమైన కానుక కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లిరోజు నయనతార వేసుకో పోయే బంగారం మొత్తం కూడా విగ్నేష్ కొనుగోలు చేసినట్లు సమాచారం. వాటి కోసం అతను దాదాపుగా రెండున్నర కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఒక డైమండ్ రింగ్ కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video


భర్త కోసం రిటర్న్ గిఫ్ట్
ఇక విగ్నేష్ భార్య కోసం కనీసం ఐదు కోట్లు అయినా ఖర్చు పెట్టాడో లేదో తెలియదు గాని నయనతార మాత్రం అతనికి కానుకగా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఒక ప్రత్యేకమైన ఇంటిని విగ్నేష్ పేరు మీద కొనుగోలు చేసినట్లు సమాచారం. చెన్నై లో దాదాపు 20 కోట్ల ఖరీదు గల ఒక ఓకే ఇంటిని కొన్న నయన్ భర్తతో కలిసి ఆ ఇంట్లో జీవించాలని డిసైడ్ అయ్యిందట. ఇక ఇంటిని కూడా పెళ్లి కానుకగా తన భర్తకు అందజేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











