నయనతార భర్తను అవమానించిన స్టార్ హీరో.. అతనితో సినిమాలు చేయనని షాకింగ్ నిర్ణయం!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది బ్యూటిఫుల్ నయనతార. సుమారు 17 ఏళ్ల పాటు సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న నయనతార తెలుగు, మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమలో సత్తా చాటుతోంది. త్వరలో జవాన్ మూవీతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి సైతం అడుగుపెట్టనుంది. అయితే డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లాడిన నయనతార ఇటీవల ట్విన్ బేబీ బాయ్స్ కి సరోగసీ ద్వారా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇదివరకు కమిట్ అయిన సినిమాలు తప్పా మరో కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోని నయన్ తన భర్తతో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ఈ క్రమంలో ఒక స్టార్ హీరో చేతిలో విఘ్నేష్ అవమానానికి గురి కావడంతో అతనితో సినిమాలే చేసేదేలే అని తేల్చి చెప్పేసిందట నయనతార.

17 ఏళ్ల నుంచి సత్తా చాటుతూ..
కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ ప్రారంభించిన మలయాళ కుట్టి నయనతార అక్కడ సత్తా చాటింది. మోడలింగ్ తర్వాత 'మనస్సినక్కరే' సినిమాతో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. విభిన్నమైన సినిమాల్లో అలరించిన నయనతార సౌత్ లేడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. దాదాపుగా 17 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో వెలుగొందుతోన్న నయనతార మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకుంది.

జవాన్ చివరి షెడ్యూల్ లో..
ఇటీవల కనెక్ట్ సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించిన బ్యూటిఫుల్ హీరోయిన్ నయనతార బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమా చేస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో బాలీవుడ్ లోకి ఎంటర్ కానుంది నయన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరగుతోంది. జవాన్ చివరి షెడ్యూల్ లో నయనతార జాయిన్ కానుంది. ఇక సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ పాపులర్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ లపై ఎన్నో రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే.

భర్తతో కలిసి సినిమాల నిర్మాణం..
ముద్దుగుమ్మ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ లపై లవ్, డేటింగ్ రూమర్స్ ఎన్ని వచ్చినా వాటిని కొట్టిపారేశారు. కానీ ఎన్నో పుకార్ల తర్వాత గతేడాది జూన్ 9న నయనతార, విఘ్నేష్ శివన్ ల వివాహం
మహాబలిపురం ఘనంగా జరిగింది. అనంతరం వీరిద్దరికి సరోగసీ విధానం ద్వారా ట్విన్ బేబీ బాయ్స్ పుట్టగా వారికి ఉయిర్ అండ్ ఉలగమ్ అని పేర్లు కూడా పెట్టారు. ఇక ఒప్పుకున్న సినిమాలు తప్పా మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేయని నయనతార భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది.

ఫిబ్రవరి మొదటి వారంలో..
రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార, విఘ్నేష్ శివన్ లు సినిమాలు నిర్మిస్తున్నారు. నచ్చిన కథ దొరికితే వాటిని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు ఈ భార్యాభర్తలు. ఈ క్రమంలోనే విఘ్నేష్ శివన్ కు తమిళ స్టార్ హీరో అజిత్ తో ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ మూవీ ఫిబ్రవరి మొదటి వారంలోనే సెట్స్ పైకి వెళ్తుందని వార్తలు వినిపించాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఓకే చెప్పినట్లు టాక్.

సర్ది చెప్పిన నయనతార..
సెట్స్ పైకి వెళ్లే సమయంలో చివరి క్షణంలో విఘ్నేష్ శివన్ కు హీరో అజిత్ షాక్ ఇచ్చాడట. విఘ్నేష్ చెప్పిన కథ అజిత్ తోపాటు లైకా సంస్థకు నచ్చలేదట. దీంతో కథలో కొన్ని మార్పులు చేయమని అజిత్ చెప్పాడట. దానికి విఘ్నేష్ శివన్ నిరాకరించడంతో ఆ సినిమా చేయనని అజిత్ చెప్పాడట. దీంతో రంగంలోకి దిగిన నయనతార అజిత్ తోపాటు లైకా సంస్థకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిందని తెలుస్తోంది. అయినా కథలో మార్పులు చేసేవరకు సినిమా చేయనని అజిత్ స్పష్టం చేశాడట.

భర్త కథను తిరస్కరించి అవమానం..
ఎంత చెప్పిన అజిత్ వినకపోయేసరికి.. అతనితో ఇకపై సినిమాలు చేసేది లేదని తేల్చి చెప్పేసిందట నయనతార. తన భర్త కథను తిరస్కరించి అవమానించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అలాగే లైకా సంస్థతో కూడా సినిమాలు చేయనని షాకింగ్ నిర్ణయం తీసుకుందట ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే నయనతార-అజిత్ లది హిట్ కాంబినేషన్. బిల్లా, ఆరంభం, విశ్వాసం వంటి బ్లాక్ బస్టర్స్ ఈ జోడీ ఖాతాలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











