ఆ సినిమా కోసం నితిన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అడిగిన నయన్.. టూ మచ్!

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్నా కూడా అందులో నయనతార రేంజ్ లో మాత్రం ఎవరు కూడా క్రేజ్ అందుకోవడం లేదనే చెప్పాలి. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో నటిస్తోంది. ఇక బిగ్ బడ్జెట్ సినిమాలో కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తూ తన రేంజ్ ని మరింత పెంచుకుంటోంది. అలాగే అప్పుడప్పుడు తన రేంజ్ కి తక్కువగా ఉన్న కుర్ర హీరోలతో కూడా ఈ బ్యూటీ రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతోంది.

పోటీగా ఎంత మంది వచ్చినా కూడా

పోటీగా ఎంత మంది వచ్చినా కూడా

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్యన పోటీ తీవ్రత రాను రాను మరింత ఎక్కువవుతోంది. అయితే పోటీగా ఎంత మంది వచ్చినా కూడా నయన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అవసరం అయినప్పుడు గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది. అందుకే రెమ్యునరేషన్ కూడా ఏ మాత్రం తగ్గించడం లేదు.

నితిన్ కంటే హై రేంజ్ లో

నితిన్ కంటే హై రేంజ్ లో

ఇక ఇటీవల నితిన్ సినిమాలో నటించే ఆఫర్ రాగా అమ్మడు నితిన్ కంటే హై రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. దాదాపు 9కోట్ల వరకు అడగడంతో అందరూ షాక్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యదిక రెమ్యునరేషన్ అందుకుంటున్న లిస్ట్ లో నయన్ పేరు కొనసాగుతోంది.

 అంతకంటే ఎక్కువగా 9కోట్లు

అంతకంటే ఎక్కువగా 9కోట్లు

గత మూడేళ్ళ నుంచి నయన్ తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేస్తున్నట్లు తెలుస్తోంది. నితిన్ అందాదున్ రీమేక్ కోసం నయన్ అయితే బావుంటుందని ఇటీవల నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే నితిన్ రెమ్యునరేషన్ 6 నుంచి 7కోట్ల మధ్యన ఉంటే నయన్ మాత్రం అంతకంటే ఎక్కువగా 9కోట్లు ఆడిగిందట.

Recommended Video

కరోనా రూమర్స్ ని వెరైటీ గా ఖండించిన Nayanthara , Vignesh Shivan
అందుకే ఆ స్థాయిలో..

అందుకే ఆ స్థాయిలో..

అందాదున్ తెలుగు రీమేక్ సినిమాలో హీరోయిన్ పాత్రను బోల్డ్ గా చూపించనున్నారట. అందుకే ఆ స్థాయిలో రెమ్యునరేషన్ అడిగినట్లు టాక్ వస్తోంది. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇక మెర్లపాక గాంధీ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X