సైరా ఎఫెక్ట్.. నయనతార ప్రవర్తనకు కారణమిదేనా? అంతలా హర్ట్ అయ్యిందా..?

సౌత్ ఇండియన్ సినిమాల్లో వెండితెర క్వీన్‌ ఎవరంటే.. ముందుగా చెప్పే పేరు నయనతార. తెలుగుతో ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోని అందరు అగ్ర హీరోలతో ఆడిపాడిన ఈమె.. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా 'సైరా నరసింహా రెడ్డి' లో నటించింది. అయితే ఈ సినిమా విషయమై నయన్ బాగా నిరాశ చెందిందని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

సైరా నరసింహా రెడ్డి.. చిరంజీవి భార్య

సైరా నరసింహా రెడ్డి.. చిరంజీవి భార్య

సైరా నరసింహా రెడ్డి మూవీని 1857 బ్రిటిష్ కాలం నేపథ్యంలో రూపొందించారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం అప్పటి పరిస్థితులకు అద్దంపట్టేలా భారీ సెట్స్ వేసి రూపొందించారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి భార్య సిద్దమ్మ పాత్ర పోషించింది నయనతార.

ఏకంగా 6 కోట్లు.. ధైర్యం చేసిన రామ్ చరణ్

ఏకంగా 6 కోట్లు.. ధైర్యం చేసిన రామ్ చరణ్

ఈ సినిమాలో నటించినందుకు గాను భారీ పారితోషికం అందుకుందట నయనతార. ఆమెకు నిర్మాత రామ్ చరణ్ ఏకంగా 6 కోట్లు ఇచ్చుకున్నారని తెలిసింది. ఈ సినిమా సైన్ చేసేటప్పుడే ఈ మేర కావాలని నయన్ కోరడంతో వెంటనే ఓకే చెప్పిన చెర్రీ.. అంత మొత్తం ముట్టజెప్పారని సమాచారం.

నయనతార క్యారెక్టర్ అలాంటిది.. హర్ట్ అయింది

నయనతార క్యారెక్టర్ అలాంటిది.. హర్ట్ అయింది

సాధారణంగా నయనతార తనతో పనిచేసే హీరోలను, తోటి ఆర్టిస్టుల గురించి అంతగా పట్టించుకోదు. తన పని తాను చేసుకుంటూ వెళ్తూ సినిమా పూర్తికాగానే ప్రమోషన్స్‌కి కూడా రాదు. సైరా విషయంలోనూ నయన్ అదేపని చేసింది. కానీ తీరా 'సైరా' సినిమా విడుదలయ్యాక ఆమెకు క్రెడిట్ దక్కకపోతుండటం పై హర్ట్ అయిందని తెలుస్తోంది.

కోపంలో నయన్..

కోపంలో నయన్..

సైరా నరసింహా రెడ్డి సినిమాలో చిరంజీవి భార్యగా సిద్ధమ్మ పాత్రలో నయనతార మెయిన్ హీరోయిన్‌గా నటిస్తే, చిరంజీవి ప్రేమికురాలి రోల్ తమన్నా పోషించింది. కానీ సైరా సినిమాలో నయనతార కన్నా తమన్నా పాత్రే ఎక్కువ సేపు ఉండడం, తీరా సినిమా విడుదలయ్యాక అందరూ తమన్నానే పొగడటం నయనతారకు ఆగ్రహం తెప్పిస్తోందట.

నయనతార ప్రవర్తనకు కారణం?

నయనతార ప్రవర్తనకు కారణం?

'చిరంజీవి అయితే ఏంటి.. నాకు ఏ సినిమా అయినా ఏ హీరో అయినా ఒకటే' అన్నట్టుగా సైరా ప్రమోషన్స్ సమయంలో నయనతార వ్యవహరించిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సైరా సినిమాలో తన పాత్ర కన్నా తమన్నా పాత్రకి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉండటం కారణంగానే.. నయన్ సైరా ప్రమోషన్స్‌కి రాలేదని ప్రస్తుత టాక్. అప్పుడు నయనతార ప్రవర్తనకు అసలు కారణం ఇదే అని చెప్పుకుంటున్నారు జనం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X