నయనతారకు హిందీలో భారీ ఆఫర్.. జవాన్ తర్వాత క్రేజీ ప్రాజెక్ట్‌తో..

దక్షిణాదిలో అగ్ర హీరోయిన్‌గానే కాకుండా అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్లలో నయనతార ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. కొన్ని సంవత్సరాలుగా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతోపాటు, అగ్ర హీరోల చిత్రాల్లో నటిస్తూ ఆమె వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారు.

అయితే తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషలతోపాటు బాలీవుడ్ చిత్రాల్లో నటించమని కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆమె తనకు నచ్చిన ప్రాజెక్టులతోనే ముందుకు వెళ్తున్నారు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో నటించేందుకు సానుకూలత వ్యక్తం చేశారనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాప్ అయింది. అయితే హిందీలో ఆమె నటించే సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

కంటెంట్ ప్రధానమైన, తన పాత్రకు వాల్యూ ఉండే కథలతో రూపొందే చిత్రాల్లోనే నయనతార నటించేందుకు మొగ్గు చూపుతున్నారనే విషయం ఆమె ఎంచుకొనే సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. ఇటీవల ఆమె నటించిన శంకర్ వరప్రసాద్ చిత్రంలో బలమైన పాత్రను పోషించింది. ఈ చిత్రంలో గ్లామర్‌గాను, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్లో మెరిసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం తెలిసిందే.

Nayanthara entry into Bollywood after Jawan

అయితే దక్షిణాదిలో తన హావాను కొనసాగిస్తున్న నయనతార.. హిందీ రంగంపై అంతగా ఆసక్తి చూపించకపోవడం ఓ టాపిక్‌గానే మారింది. అయితే గతంలో చాలా ఆఫర్లు వచ్చినా పక్కన పెట్టిన ఈ అందాల భామ.. చివరకు అట్లీ దర్శకత్వంలో, షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ చిత్రం సుమారుగా 1000 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. ఆ తర్వాత హిందీలో భారీ ఆఫర్లు తలుపు తట్టినా పలు చిత్రాలను రిజెక్ట్ చేసినట్టు తెలిసింది.

అయితే ప్రస్తుతం హిందీ సినిమాకు నయనతార ఒకే చెప్పినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. ముంబైకి చెందిన మినీ ఫిల్మ్స్ అనే సంస్థ నిర్మించబోయే ఓ సినిమాలో ఆమె నటించనున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ సినిమా కథ నచ్చడం, అలాగే తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండటం కారణంగా ఆ సినిమాను ఒప్పుకొన్నారు. అంతేకాకుండా భారీగా రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారనే తెలిసింది. దాంతో జవాన్ తర్వాత మరోసారి హిందీ ప్రేక్షకులకు నయనతార చేరువ కానున్నారు. అయితే ఆమె నటించిన టాక్సిక్ చిత్రం కూడా త్వరలోనే రిలీజ్ కానున్నది.

ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో కంటెంట్ ప్రధానంగా ఉండే చిత్రాలను మిని ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సంస్థ నిర్మించిన ఫొరెన్సిక్, ఆంఖో కి గుస్తాకియా అనే చిత్రాలు మంచి విజయాలను అందుకొన్నాయి. తమ సంస్థ నుంచి వచ్చే మరో విభిన్నమైన చిత్రం కోసం నయనతారను సంప్రదించగా.. ఆమె అందుకు ఒకే చెప్పినట్టు తెలిసింది. త్వరలోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దాంతో మరోసారి నార్త్ ఆడియెన్స్‌ను తన అందచందాలతో మైమరిపించేందుకు రెడీ అవుతున్నారు.

More from Filmibeat

Read more about: nayanthara jawan toxic
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X