లవ్ ఎఫైర్?...నయనతార కొట్టడంతో ఆసుపత్రి పాలైన హీరో

By Bojja Kumar

చెన్నై: లవ్ ఎఫైర్లతో ఎప్పుడూ వార్తల్లో....వివాదాల్లో ఉండే సౌతిండియా హాట్ హీరోయిన్ నయనతార మరో వివాదంతో తాజాగా వార్తల్లోకి ఎక్కింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు, తమిళ యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్‌పై నయనతార చేయి చేసుకుంది. కంటికి గాయం కావడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

అసలు వివరాల్లోకి వెళితే....ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా ప్రస్తుతం తమిళంలో ‘నాన్‌బెండ' అనే చిత్రం తెరకెక్కుతోంది. షూటింగులో భాగంగా నయనతార విలన్ చెంప చెల్లుమనిపించే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. అయితే అనుకోకుండా నయన చేయి స్టాలిన్‌కు తగిలింది. నయనతార చేతి వేలిగోర్లు అతని కంటికి తాకడంతో గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

Nayanthara hospitalizes Udaynidhi Stalin

ఈ సంఘటనతో రకరకాల వార్తలు తమిళ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. నయనతార, స్టాలిన్ ప్రేమించుకుంటున్నారని, నయనతార అతని ప్రేమను తిరస్కరిస్తూ చెంపపై కొట్టడంతో స్టాలిన్ ఆత్మహత్య ప్రయత్నం చేసారనే రూమర్లు వ్యాపించాయి. అయితే ఈ వార్తలను ఉదయనిధి స్టాలిన్ వెంటనే ఖండించారు.

తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, తాము మంచి స్నేహితులమని ఉదయనిధి స్ఠాలిన్ తెలిపారు. తాను సూసైడ్ ప్రయత్నం చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ‘నాన్‌బెండ' చిత్రం షూటింగ్ జరుగుతుండగా అనుకోకుండా నయనతార చేయి తన కంటికి తాకండంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు స్టాలిన్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X