Nayanthara Remuneration: నయనతారకు రికార్డు రెమ్యునరేషన్.. సల్మాన్ ఖాన్‌తో మూవీకి ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్‌తో సినిమా తర్వాత మరోసారి దక్షిణాది డైరెక్టర్ సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హిందీ సినిమా రంగంలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. అయితే ఈ సినిమాలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార నటించేందుకు ఒప్పుకోవడం మరో విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఈ సినిమాకు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడంతోనే ఆమె ఒప్పుకొన్నదనే వార్త మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే నయనతార కెరీర్, ఈ సినిమాకు ఆమె తీసుకొనే రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..

నయనతార తన కెరీర్ మొత్తం దక్షిణాది సినిమా రంగానికే పరిమితమైంది. తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌ను సంపాదించుకొన్నారు. అయితే గతంలో హిందీలో భారీ ఆఫర్లు వచ్చిన ఆమె బాలీవుడ్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపలేదు. ఆ క్రమంలో ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంతో స్టార్ హీరోల పక్కన నటించే విషయంపై పెద్దగా దృష్టిపెట్టలేదు అని సినీ వర్గాలు చెప్పుకొంటాయి.

Nayanthara Remuneration

అయితే హిందీలో నటించరు అనుకొన్న సమయంలో అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కావడంతో ఆఫర్లు వెతుక్కొంటూ వచ్చి వెంటాడాయి. అయినా హిందీ సినిమా రంగానికి దూరంగానే ఉంది. కానీ తాజాగా మరోసారి దక్షిణాది డైరెక్టర్ రూపొందిస్తున్న సినిమాలో నటించేందుకు సిద్దమయ్యారు.

సల్మాన్ ఖాన్‌తో భారీ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్న నేపథ్యంలో నయనతార రెమ్యునరేషన్ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. అయితే ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడమే కాకుండా సినిమాలో ఆమె పాత్ర పవర్‌ఫుల్‌గా, బలమైన రోల్ ఉండటంతో ఒప్పుకొన్నారనే విషయం సినీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది.

అయితే దిల్ రాజు నిర్మించే ఈ సినిమా కోసం నయనతారకు భారీగా పారితోషికం ఇచ్చారు. ఆమెకు సుమారుగా 10 కోట్ల రూపాయల మేర రెమ్యునరేషన్ ఆఫర్ చేశారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. నయనతార రెమ్యునరేషన్‌తో ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా రూపొందబోతుందనే విషయం ఇటు సౌత్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది.

నయనతార కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆమె నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకొన్నారు. దాంతో దక్షిణాదిలో తన క్రేజ్ తిరుగులేదని నిరూపించుకొన్నారు. ప్రస్తుతం ముక్తి అమ్మన్ 2, మన్నన్‌గట్టి సిన్స్ 1960, హాయ్ రక్కాయి అనే చిత్రాల్లో నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది.యష్‌తో రూపొందిస్తున్న టాక్సిక్ సినిమా విడుద కావాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: nayanthara dil raju salman khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X