Nayanthara: పెళ్లి తర్వాత నయనతార షాకింగ్ నిర్ణయం!.. అభిమానుల్లో టెన్షన్..
దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో లేడి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది బ్యూటీఫుల్ హీరోయిన్ నయనతార. సుమారు 17 ఏళ్లుగా సినీ రంగంలో విభిన్నమైన సినిమాలు చేస్తూ మాలీవుడ్ టు టాలీవుడ్ వయా కోలీవుడ్ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ వస్తోంది. ఇటీవల కోలీవడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను పెళ్లాడి, వివాహ బంధంలో మునిగితేలుతున్న నయనతార తాజాగా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పనుందని టాక్ వినిపిస్తోంది.

లేడి సూపర్ స్టార్‌గా..
నయనతార సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 17 ఏళ్లు కావోస్తుంది. దక్షిణ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో చిత్రాలు చేసి సౌత్ ఇండియా లేడి సూపర్ స్టార్‌గా స్టార్డమ్ సంపాందించుకుంది. ఇక తాజాగా ఆమె బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే.

షారుక్ ఖాన్‌తో హిందీలోకి ఎంట్రీ..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన జవాన్ అనే చిత్రంలో నయనతార హీరోయిన్గా చేయనుంది. ఇదే కాకుండా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న గాడ్ ఫాదర్ మూవీలో చిరుకు చెల్లెలిగా నయనతార నటించిన విషయం తెలిసిందే. అలాగే తమిళంలో నయనతార చేసిన గోల్డ్ అనే చిత్రం ఈ సెప్టెంబర్ 8న విడుదల కానుంది.

షాకింగ్ డెసిషియన్..
ఇవే కాకుండా మరో రెండు సినిమాలకు నయనతార సైన్ చేసింది. అయితే ఈ క్రమంలోనే నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె తన యాక్టింగ్ కెరీర్‌కు స్వస్తి పలకనుందని సినీ వర్గాల భోగట్టా. అయితే ప్రస్తుతం తన చేతిలో ఉన్న ఈ రెండు సినిమాలను పూర్తి చేశాక తన యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పనుందని పుకార్లు వినిపిస్తున్నాయి.

బిజినెస్ వుమెన్‌గా..
నయనతార తన యాక్టింగ్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేసి వ్యాపారవేత్తగా మారాలాని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఇతర రంగాల్లో పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలు సినిమాలను కూడా నిర్మించాలను నయనతార భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై అధికారికంగా ప్రకటనంటూ ఏం లేదు గానీ, పుకార్లు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.

అభిమానుల్లో టెన్షన్..
దీంతో నయనతార అభిమానులు టెన్షన్ పడుతున్నారట. ఇదిలా ఉంటే మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో మొదటగా గ్లామరస్ పాత్రలతో ఆకట్టుకున్న నయన్.. తర్వాత నటన ఉన్న పాత్రలు చేసి శభాష్ అనిపించుకుంది. వివిధ చిత్రసీమ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకునే రేంజ్‌కు ఎదిగింది.

అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్గా..
ఇక దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్గా నయనతార పేరు గడించింది. కాగా ఇటీవల కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను సాంప్రాదాయ పద్ధతిలో వివాహం చేసుకుంది నయనతార. ఇటీవల విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన కణ్మణి రాంబో ఖతీజా సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఇందులో నయనతారతోపాటు స్టార్ హీరోయిన్ సమంత, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధానపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











