నయనతారకు భారీగా ముట్టజెప్పిన రామ్ చరణ్! ఎన్ని కోట్లో తెలుసా..? వైరల్ న్యూస్

సౌత్ ఇండియన్ సినిమాల్లో వెండితెర క్వీన్‌గా కొనసాగుతోంది అందాల సుందరి నయన తార. గత కొన్నేళ్లుగా సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న ఈ భామ.. దక్షిణ భారత అన్ని భాషల్లోని అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, పారితోషికం పరంగా కూడా ఈ అమ్మడిదే ప్రథమ స్థానం. తాజాగా ఆమె నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి కోసం ఓ రేంజ్ పారితోషికం అందుకుందట నయనతార.

సైరా నరసింహా రెడ్డి.. చిరంజీవి భార్య

సైరా నరసింహా రెడ్డి.. చిరంజీవి భార్య

సైరా నరసింహా రెడ్డి మూవీని 1857 బ్రిటిష్ కాలం నేపథ్యంలో రూపొందించారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం అప్పటి పరిస్థితులకు అద్దంపట్టేలా భారీ సెట్స్ వేసి రూపొందించారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి భార్య సిద్దమ్మ పాత్ర పోషించింది నయనతార.

భారీగా ముట్టజెప్పిన రామ్ చరణ్

భారీగా ముట్టజెప్పిన రామ్ చరణ్

ఈ సినిమాలో నటించినందుకు గాను భారీ పారితోషికం అందుకుందట నయనతార. ఆమెకు నిర్మాత రామ చరణ్ ఏకంగా 6 కోట్లు ఇచ్చుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా అంగీకారం సాయమయంలోనే ఈ మేర కావాలని నయన్ కోరడంతో వెంటనే ఓకే చెప్పిన చెర్రీ.. అంత మొత్తం ముట్టజెప్పారని సమాచారం.

5 భాషల్లో సైరా నరసింహా రెడ్డి

5 భాషల్లో సైరా నరసింహా రెడ్డి

మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందింది సైరా నరసింహా రెడ్డి చిత్రం. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ,తమిళ్,కన్నడ,మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇలా ఏకంగా 5 భాషల్లో విడుదల కాబోతున్న తొలి తెలుగు సినిమాగా 'సైరా నరసింహారెడ్డి' రికార్డు నమోదు చేయనుంది.

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

గతంలో ఎన్నడూ ఏ సినిమాకు చేయని రీతిలో 'సైరా నరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అత్యంత గ్రాండ్‌గా చేయాలని భావిస్తున్నారట రామ్ చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబందించిన పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ నెల 15 వ తేదీన ఈ వేడుకను కర్నూలులో నిర్వహించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సైరా నరసింహా రెడ్డి మూవీ విశేషాలు

సైరా నరసింహా రెడ్డి మూవీ విశేషాలు

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది సైరా నరసింహా రెడ్డి మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X