నిర్మాతలకు చుక్కలు చూపిస్తోన్న నయన్.. అంత ఇచ్చుకోలేమని చేతులెత్తారట
నయన తారకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. సెకండ్ హీరోయిన్‌గా మొదలైన ఆమె ప్రస్థానం.. మెయిన్ లీడ్ నుంచి స్టార్ హీరోయిన్.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వరకు ఎదిగింది. ప్రస్తుతం దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా దూసుకుపోతోన్న నయన్ డిమాండ్ ఏరేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. ఈ మేరకు నయన్ పారితోషికం కూడా అంతే మొత్తంలో ఉంటుంది. ఈ విషయంపై తాజాగా ఓ వార్త బాగానే వైరల్ అవుతోంది.

దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్..
తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా మిగతా చోట్లా నయన్ పాపులార్టీ ఓ రేంజ్‌లో ఉంది. బడా హీరోలు సైతం ఆమె డేట్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటేనే నయన్ క్రేజ్ ఏపాటిదో అర్థమవ్వాలి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటుతూ బ్లాక్ బస్టర్ హిట్‌లను కొట్టేస్తూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది.
Recommended Video

ప్రియుడితో చెట్టాపట్టాల్..
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ప్రియుడు విఘ్నేశ్ శివన్‌కు మాత్రం సమయం కేటాయిస్తుంది. నేను రౌడీనే.. అనే చిత్రంతో విఘ్నేశ్ శివన్, నయనతార కలిసి పనిచేయగా.. ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగసాగారు. అంతేకాకుండా సొంత నిర్మాణ సంస్థను స్థాపించి ప్రియురాలితో సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు.

నయన్ డిమాండ్‌కు చుక్కలు..
ఆర్జే బాలాజీ చెప్పిన కథ బాగుండడంతో ఓకే చెప్పిన నయన్.. రెమ్యూనరేషన్ గా 8 కోట్ల రూపాయలు అడిగిందట. దీంతో నిర్మాతలకు షాక్ కొట్టినట్టైందట. తెలుగు-తమిళ భాషల్లో నయనతారకు మంచి క్రేజ్ & మార్కెట్ ఉన్నప్పటికీ మరీ 20 కోట్ల రూపాయల బిజినెస్ చేసే స్థాయికి మాత్రం నయనతార ఇంకా చేరుకోలేదన్నది నిజం.

చేతులెత్తేసిన నిర్మాతలు..
క్రేజ్ ఉన్నప్పటికి బడ్జెట్ పెరిగితే అంత రాబట్టలేకపోవచ్చు. ఈ విషయం నిర్మాతలకు తెలియనిది కాదు. అలాంటప్పుడు కేవలం తన రెమ్యూనరేషన్‌గానే 8 కోట్ల రూపాయలు అడిగితే.. ఇక ప్రొడక్షన్ & పబ్లిసిటీకి దర్శకనిర్మాతలు బడ్జెట్ ను ఎలా సరిపెట్టుకోవాలి అంటూ దర్శకనిర్మాతలు ఆలోచనలోపడ్డారట. ఇది తమ వల్ల అయ్యే పని కాదని చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయాన్ని నయనతార పరిగణలోకి తీసుకొని.. తన రెమ్యూనరేషన్ తగ్గించుకొంటే ప్రాజెక్ట్ ముందుకు కదిలే అవకాశం ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications











