ఇంట్రెస్టింగ్: నయన్ స్థానాన్ని కొట్టేసిన సమంత
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవ్వరి స్టార్ ఎలా తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కొన్ని సినిమాలు ఇచ్చిన విజయాలు హీరో హీరోయిన్స్ ఎక్కడో నిలబెడతాయి. ఆ కోవకే చెందుతారు నయనతార, సమంత. తెలుగుతో పాటు సౌత్ ఇండియా లోని అన్ని భాషల్లో క్రేజ్ కొట్టేసి సిల్వర్ స్క్రీన్ క్వీన్‌గా పిలిపించుకుంటోంది నయనతార. ఇటువైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతోంది సమంత. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ మధ్యన పోటీ నెలకొందట. ఈ పోటీలో నయన్ స్థానాన్ని కొట్టేసిందట సామ్. అదెలాగంటారా..!
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ నయనతార అన్నట్లుగా సాగుతోంది ఆమె సినీ ప్రయాణం. ఒకప్పుడు నయన్ సినిమా వస్తుందంటేనే సూపర్ డూపర్ హిట్ ఖాయం అని ఫిక్సయ్యే వారు ఆడియన్స్. కానీ ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతూ వస్తుండటంతో ఆమెతో సినిమా అంటే కాస్త ఆలోచనలో పడుతున్నారట దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో నయనతార నటించాల్సిన సినిమాలో సమంత పేరును పరిశీలన లోకి తీసుకురావడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రెండేళ్ల కింద నయన్ ప్రధాన పాత్రలో వచ్చిన 'అరమ్' సినిమా తెలుగులో కూడా 'కర్తవ్యం' పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఎమోషనల్ లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన ఈ మూవీ టాలీవుడ్ ఆడియన్స్ చేత కంటతడి పెట్టించింది. తమిళ, తెలుగు రెండు భాషల్లోనూ విజయ సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు గోపీ నైనర్.
అయితే ఈ సీక్వల్ లో కూడా నయనతారనే తీసుకోవాలని భావించిన ఆ దర్శకుడు.. ప్రస్తుతం సమంత పేరును పరిశీలనలో పెట్టినట్లు తెలుస్తోంది. సమంత కూడా ఓకే చెప్పిందంటే ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని సన్నాహాలు చేస్తున్నారట. చూడాలి మరి ఇకవేళ సమంత ఈ రోల్ పోషిస్తే నయన్‌ని ఎలా రీ ప్లేస్ చేస్తుందనేది. ఇక ఇటీవలే సమంత లేడీ ఓరియెంటెడ్ మూవీ 'ఓ బేబీ' సక్సెస్ కావడం మూలంగా సమంత లీడ్ రోల్ సినిమాల పట్ల జనాల్లో కూడా ఆసక్తి రెట్టింపయింది.


Click it and Unblock the Notifications











