నయనతార షాకింగ్ డిసీజన్! కారణం చిరంజీవి.. ఇదే జరిగితే! మెగా ఫ్యాన్స్ రియాక్షన్

సౌత్ ఇండియన్ సినిమాల్లో వెండితెర క్వీన్‌గా కొనసాగుతోంది నయనతార. కొన్నేళ్లుగా సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ దక్షిణ భారత అన్ని భాషల్లోని అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, పారితోషికం పరంగా కూడా ఈ అమ్మడిదే ప్రథమ స్థానం. ఇవన్నీ ఓకే కానీ ఒక్క విషయంలో మాత్రం నయనతార ఎప్పుడూ దూరంగా ఉంటోందని, అదే ఆమెలో మైనెస్ అని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఆమె ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది.

క్రమశిక్షణతో సినిమా.. కానీ ఆ విషయంలో

క్రమశిక్షణతో సినిమా.. కానీ ఆ విషయంలో

సినిమా అంతా క్రమశిక్షణతో పూర్తి చేస్తుంది కానీ చివరకు ప్రమోషన్స్ దగ్గర మాత్రం నయనతార జాడ కనిపించదని ప్రచారం జరుగుతోంది. గతంలో చాలా సినిమాల విషయంలో ఇలాగే ప్రవర్తించిన నయన్.. మెగాస్టార్ సినిమా సైరాకు కూడా అలాగే డుమ్మా కొడుతుందని అనుకున్నారంతా. కానీ అందరికీ షాకిస్తూ ఓ డిసీజన్ తీసుకుందట.

గ్రాండ్‌గా సైరా ప్రీ రిలీజ్ వేడుక

గ్రాండ్‌గా సైరా ప్రీ రిలీజ్ వేడుక

సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు సర్వం సిద్ధం చేశారు. అంగరంగ వైభవంగా హైదరాబాద్‌లో ఈ వేడుక నిర్వహించనున్నారు. నిజానికి ముందుగా ఈ వేడుకను సెప్టెంబర్ 18నే నిర్వహించాలని అనుకున్నప్పటికీ, చివరి క్షణంలో దాన్ని వాయిదా వేసి సెప్టెంబర్ 22న విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా పవన్ కళ్యాణ్ వస్తున్నారు.

 నేను కూడా అంటూ నయన్..

నేను కూడా అంటూ నయన్..

దీంతో ఈ వేడుకలో తాను కూడా అటెండ్ అవుతానని అంటోందట నయనతార. తాను ప్రమోషన్స్ లో పాల్గొనని తనపై పడిన ముద్రను చెరిపేసేలా ఆమె ఈ షాకింగ్ డిసీజన్ తీసుకుందట. సైరా తమిళ వెర్షన్‌కి సంబంధించి చెన్నైలో జరుపనున్న ప్రమోషన్ ఈవెంట్‌కి కూడా నయన్ రాబోతోందని సమాచారం. దీంతో మెగా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

చిరంజీవి కారణం గానే

చిరంజీవి కారణం గానే

సాధారణంగా తాను సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనని అగ్రిమెంట్ సమయంలోనే చెబుతుందట నయనతార. కానీ సైరా విషయంలో మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం చిరంజీవే అని చెబుతోందట నయన్. మెగాస్టార్ పై ఉన్న అమితమైన అభిమానమే తనను ఈ ఈవెంట్‌కి రప్పిస్తోందని అంటోందట. ఇదే జరిగితే.. మెగా అభిమానులకు పండగే కదా!.

తమన్నా, నయనతార టాలెంట్ చూపారు

తమన్నా, నయనతార టాలెంట్ చూపారు

ఇక సైరా ట్రైలర్‌ విషయానికొస్తే.. ఇందులో ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు కేక పెట్టించేలా ఉన్నాయి. తమన్నా గ్లామర్, నయనతార ఫెర్ఫార్మెన్స్ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి. విలన్‌గా సుదీప్ హావభావాలు, విజయ్ సేతుపతి ఫెర్ఫార్మెన్స్ అదిరిపోయేలా కనిపించాయి.

వరల్డ్‌వైడ్‌గా భారీ రెస్పాన్స్

వరల్డ్‌వైడ్‌గా భారీ రెస్పాన్స్

మరోవైపు 'సైరా నరసింహా రెడ్డి' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రి రిలీజ్ వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లకుపైగా జరిగినట్టు తెలిసింది. ఓ తెలుగు సినిమా విషయానికి వస్తే.. ఇదే అత్యుత్తమ రికార్డ్ అని చెప్పుకొంటున్నారు.

సైరా మూవీ

సైరా మూవీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X