చిరంజీవితో మిల్కీ బ్యూటీ తమన్నా రొమాన్స్.. నయనతారతో రెండోసారి!

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది మరింత బిజీ కాబోతున్నారు. గత ఏడాది కాలంగా చిరంజీవి నటిస్తున్న క్రేజీ చిత్రం సైరా నరసింహారెడ్డి షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి తన కెరీర్ లోనే ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్నారు. తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా మరోవైపు చిరు, కొరటాల శివ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ల గురించి ఆసక్తికర వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

మెగాస్టార్‌తో మిల్కీ బ్యూటీ

మెగాస్టార్‌తో మిల్కీ బ్యూటీ

దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే చిరంజీవి సరసన నటించే హీరోయిన్లని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొరటాల శివ మిల్కీ బ్యూటీ తమన్నా, నయనతార పేర్లని ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త హీరోయిన్లని తీసుకునే కంటే వీరినే ఎంపిక చేస్తే మంచిదనే అభిప్రాయానికి కొరటాల వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల చిత్రంలో తమన్నా నటించేది ఖరారైతే తొలిసారి మెగాస్టార్ సరసన రొమాన్స్ చేయబోతున్నట్లు అవుతుంది. తమన్నా సైరా నరసింహారెడ్డిలో నటిస్తున్నప్పటికీ తనది హీరోయిన్ పాత్ర కాదు.

నయనతార రెండోసారి

నయనతార రెండోసారి

కొరటాల శివ సిద్ధం చేసుకున్న కథ ప్రకారం ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు ఆస్కారం ఉందట. మరో హీరోయిన్ గా నయనతార పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నయనతార సైరా నరసింహారెడ్డి చిత్రంతో హీరోయిన్ గా నటిస్తోంది. నరసింహారెడ్డి సతీమణి సిద్ధమ్మ పాత్రలో నయన్ కనిపించబోతోంది. నయన్, చిరు జోడి బావుంటుందని భావిస్తున్న కొరటాల ఆమెని కూడా ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

బరువుతగ్గే పనిలో

బరువుతగ్గే పనిలో

ఈ చిత్రం కోసం బరువు తగ్గాలని కొరటాల చిరంజీవిని కోరారట. సైరా షూటింగ్ ఓ కొలిక్కి రాగానే చిరు జిమ్ లో కసరత్తులు మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలోకానీ, మార్చి ఆరంభంలో కానీ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా తాను లేని సన్నివేశాలని చిత్రీకరించమని కొరటాలకు చిరంజీవి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ లోపు సైరా షూటింగ్ ఫినిష్ చేసి తాను బరువు తగ్గుతానని చిరు హామీఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

 ప్రీప్రొడక్షన్ పనులు

ప్రీప్రొడక్షన్ పనులు

ఈ చిత్రాన్ని కూడా రాంచరణ్ నిర్మించబోతున్నట్లు ప్రచారం జరిగుతోంది. కానీ పూర్తి స్థాయిలో క్లారిటీ రావడం లేదు. చిరు రి ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెం 150 చిత్రానికి రాంచరణే నిర్మాత. ప్రస్తుతం తెరకెక్కుతున్న సైరాని కూడా రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ లొకేషన్స్ వేటలో ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X