దర్శకుడితో హీరోయిన్ నయనతార రహస్య వివాహం?
హీరోయిన్ నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ను రహస్యంగా పెళ్లి చేసుకోబోతోందట.
Recommended Video

స్టార్ హీరోయిన్లు రహస్యంగా పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో కొత్తేమీకాదు. ఎందుకు అలా చేస్తారు? అంటే.... పెళ్లయిన హీరోయిన్లకు ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువగా ఉంటాయని, అందుకే ఈ విషయాలను రహస్యంగా ఉంచుతారని అంటుంటారు.
ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెలుతున్న నయనతార విషయంలో కూడా ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్న నయనతార అతడిని రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇద్దరూ చెట్టా పట్టాల్
ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల కాలంలో ఇద్దరూ విదేశీ ట్రిప్స్ వేయడం, ఆయా కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం లాంటివి చేస్తున్నారు. దీంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లు అవుతోంది.

ప్రభుదేవతో విడిపోయిన తర్వాత
ప్రభుదేవాతో ప్రేమాయణం, సహజీవనం తర్వాత అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్న నయనతార తర్వాత పలు కారణాలతో అతడితో విబేధించి విడిపోయిన సంగతి తెలిసిందే. కొంతకాలం ఒంటరిగా ఉన్న నయనతార... విఘ్నేష్ శివన్‌తో ఓ సినిమాకు పని చేసింది. ఈ క్రమంలో అతడితో ప్రేమలో పడింది.

ఫోటోలు షేర్ చేస్తున్న జంట
నయనతార, విఘ్నేష్ శివన్ ఓపెన్ గానే రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు. ఇద్దరూ కలిసి వెళ్లిన యూఎస్ఏ హాలీడే ట్రిప్ ఫోటోలను కూడా వీరు సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం గమనార్హం.

ఆర్య సమాజ్ వివాహం
ఇద్దరూ కలిసి ఆర్య సమాజంలో వివాహం చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరు కాబోతున్నారని టాక్.

చెన్నైలో లగ్జరీ విల్లాలో కాపురం
వివాహం తర్వాత చెన్నైలో వారు కొత్తగా కొనుగోలు చేసిన లగ్జరీ విల్లాలో కాపురం పెట్టబోతున్నారని తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలోనూ నయనతార పెళ్లిపై చాలా రూమర్స్ వచ్చాయి. ఈ సారి ఈ రూమర్ నిజం అవుతుందో? లేదో చూడాలి.

తెలుగులో నయనతార చేస్తున్న సినిమాలు
నయనతార ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న 102వ సినిమాకాగా, మరొకటి త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రారంభం కాబోతున్న ‘సై రా... నరసింహారెడ్డి'.


Click it and Unblock the Notifications











