పెళ్లి విషయంలో నయనతార సంచలన నిర్ణయం.. ఆమె ప్రియుడి పరిస్థితి ఏంటి!

Recommended Video

Nayanthara Will Marry Only After Completes 100 Movies | Filmibeat Telugu

లేడీ సూపర్ స్టార్ గా, అందాల తార నయనతార దూసుకుపోతోంది. నయనతార క్రేజ్ ప్రస్తుతం ఎలా ఉందంటే ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించినా అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతోందంటే అందులో హీరోయిన్ గా దర్శక నిర్మాతలు మొదటి ప్రాధాన్యత నయనతారకే ఇస్తున్నారు. ఈ ఏడాది అజిత్ సరసన విశ్వాసం చిత్రంలో నయనతార నటించింది. మరి కొన్ని క్రేజీ చిత్రాలలో నటిస్తోంది. తాజాగా నయనతార వివాహానికి సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

లవ్ ఫెయిల్యూర్

లవ్ ఫెయిల్యూర్

నయనతార వ్యక్తిగత జీవితానికి సంబందించిన అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇద్దరు ప్రముఖ హీరోలతో ప్రేమాయణం సాగించిన నయన్.. పెళ్లి వరకు వచ్చి వారితో బ్రేకప్ అయింది. శింబు, ప్రభుదేవాతో నయన్ ప్రేమ కథ ఇప్పటికి హాట్ టాపిక్కే. వ్యక్తి గత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నయనతార.. హీరోయిన్ గా మాత్రం తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగింది.

 ఘాడమైన ప్రేమలో

ఘాడమైన ప్రేమలో

ప్రస్తుతం నయనతార సౌత్ లో లేడి సూపర్ స్టార్ గా కొనసాగుతూనే ఘాడమైన ప్రేమలో మునిగితేలుతోంది. యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార ప్రేమాయణం సాగిస్తోంది. హీరోయిన్ గా బిజీగా గడుపుతున్న నయనతార.. గ్యాప్ దొరికితో ప్రియుడితో విదేశాలకు వెకేషన్ కు వెళ్ళిపోతోంది. చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నప్పటికీ ఈ జంట ఎక్కడా తమ ప్రేమ గురించి బయటకు ప్రస్తావించడం లేదు. వీళ్ళిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారనే వార్తలు కూడా ఉన్నాయి.

 సంచలన నిర్ణయం

సంచలన నిర్ణయం

నయనతార పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. నయన్, విగ్నేష్ శివన్ జోరు చూసి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ నయనతార మాత్రం పెళ్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నటిగా అన్ని భాషల్లో కలిపి 100 చిత్రాలు పూర్తి చేసేవరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుందట.

విగ్నేష్ పరిస్థితి ఏంటి

విగ్నేష్ పరిస్థితి ఏంటి

ప్రస్తుతం నయనతార అన్ని భాషల్లో కలిపి 60కి పైగా చిత్రాల్లో నటించింది. మరో ఆరేడు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఈ లెక్కన 100 చిత్రాలు పూర్తి కావాలంటే నాలుగైదేళ్ల సమయం పడుతుంది. దీనితో నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ పరిస్థితి ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. 100 చిత్రాలుపూర్తి చేసే పెళ్లి చేసుకుంటోందో లేక మనసుమార్చుకుని ముందుగానే పెళ్ళిపీటలు ఎక్కుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X