ఎన్టీఆర్‌తో ఫస్ట్‌నైట్‌కు నో చెప్పిన హీరోయిన్!
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తర్వాతి సినిమా 'రభస'లో మళయాలం హీరోయిన్ నజ్రియాను సెకండ్ హీరోయిన్‌గా తీసుకున్నట్లు ఆ మధ్య వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న రూమర్ ఏమిటంటే...ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకోవాలని నిర్ణయించుకుందట.
దర్శకుడు ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో ఫస్ట్ నైట్ హాట్ సీన్ చేయమనడం ఆమెకు నచ్చలేదట. చివరకు ఒప్పుకుని చేసినా...ఆ సీన్ తీసిన తీరు ఆమెకు నచ్చలేదట. ఎడిటింగ్ చేసే విషయంలో దర్శకుడు కాంప్రమైజ్ కాంప్రమైజ్ కావడానికి ఇష్టపడక పోవడంతో సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుందట.
కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ ఖరారు కానప్పటికీ...'రభస' అనే పేరు ప్రచారంలో ఉంది.
ఇటీవల తొలి షెడ్యూల్‌లో కొన్ని సీన్స్ చిత్రీకరణ జరిపారు. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయినట్లు సమాచారం. ఎన్టీఆర్ సరసన సమంత మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












