NBK 107 రిలీజ్ డేట్ లో మళ్ళీ మార్పులు.. ప్రభాస్, మెగాస్టార్ లతో పోటీ తప్పేలా లేదు!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. క్రాక్ సినిమా తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ ఉండడంతో మాస్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. ఇక బాలకృష్ణ అఖండతో బీభత్సం సృష్టించిన తర్వాత మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను క్రియేట్ చేస్తాడు అని నమ్మకంతో కూడా ఉన్నారు. ఇక NBK 107 వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఇప్పటికే ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.
చూస్తూ ఉంటే ఈ సినిమాతో కూడా బాలయ్య బాబు మరొక రికార్డును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. మొన్నటి వరకు అయితే దసరా సమయానికి సినిమా వచ్చేస్తుంది అని ఒక టాక్ నడిచింది కానీ ఇటీవల సినిమా షూటింగ్ కు కొంత గ్యాప్ రావడంతో మళ్లీ డేట్ లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే నందమూరి బాలకృష్ణ 107వ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అదే సమయానికి ప్రభాస్ ఆదిపురుష్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి బోళాశంకర్ కూడా సంక్రాంతికే విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో బాలయ్య బాబుకు పోటీ తప్పేలా లేదు అనిపిస్తోంది. ఇక త్వరలోనే ఆఫీషియల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రెడ్డి గారు, అన్నగారు టైటిల్స్ కూడా సెట్ చేయాలని అనుకుంటున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ చివరి దశకు చేరుకున్న తర్వాత టైటిల్ తోపాటు మరొక టీజర్ ను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమా అనంతరం బాలయ్య అనిల్ రావిపూడి తో వెంటనే తన 108వ సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు.


Click it and Unblock the Notifications











