NBK 109: పాన్ ఇండియా హీరోయిన్‌ను రంగంలోకి దించిన బాలయ్య... నక్క తోక తొక్కిందా ఏంది?
నందమూరి బాలకృష్ణ పుల్ జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ యేడాది సంక్రాంతికి 'వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హిట్ కొట్టాడు. ఇక తన తదుపరి చిత్రం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పలువురి భామలు పేర్లు వినిపించాయి. ఇప్పుడు మరో పాన్ ఇండియా నటిని లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నందమూరి బాలకృష్ణ.. కరోనా తర్వాత ఆయన దశే మారిపోయింది. అప్పటి వరకు ఫ్లాపులు చవి చూసిన బాలయ్య.. ఆ తర్వాత పట్టుకున్నదల్లా బంగారంలా మారిపోయింది. అఖండతో హిట్ కొట్టి.. ఓటీటీలో అన్ స్టాపబుల్ షో చేయగా.. అది కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత సీజన్ 2 చేయగా.. అది కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఈ యేడాది సంక్రాంతికి 'వీరసింహారెడ్డి మూవీతో మంచి సక్సెస్‌ను అందుకున్న బాలయ్య... ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' సినిమా చేసి మరో హిట్ కొట్టాడు.

ఇక వీరసింహారెడ్డ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకోగా... మొన్న వచ్చిన భగవంత్ కేసరి సినిమాలోను కొత్త భామ కాజల్ తో తొలిసారిగా జతకట్టాడు. ఇక బాలయ్య నెక్ట్స్ మూవీ పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య ప్రారంభం కూడా అయింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీపై మరోసారి భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన నటించేందుకు హీరోయిన్లను వెతుకే పనిలో పడ్డారు దర్శకుడు బాబీ. ఈ సినిమా కోసం ముద్దుగుమ్మల వేట మొదలైందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఇందులో నలుగురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. బాబీ సినిమా మాఫియా నేపథ్యంలో నడుస్తుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇందులోనూ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారట నందమూరి నటసింహం బాలయ్య.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఓ సీనియర్ హీరోయిన్ కావాలి కాబట్టి... త్రిష హీరోయిన్ అని మొన్నటి వరకు అనుకున్నారు. అయితే ఆ ప్లేస్ లో పాన్ ఇండియా నటి ప్రియమణి చేరింది. బాలయ్య సరసన ఈ భామ నటించనుందని టాక్ వినిపిస్తుంది. త్రిష భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటంతో.. ప్రియమణికి ఓటేసేలా కనిపిస్తున్నారు మేకర్స్. ప్రియమణి కాకుండా బాలయ్య సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారట.
అందులో ఊర్వశి రౌతెలా ఇప్పటికే కన్ఫర్మ్ అవ్వగా... కేవలం స్పెషల్ సాంగ్ కాకుండా కీలక పాత్రలోనూ నటిస్తున్నారాని తెలుస్తోంది. ఇక యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి సైతం ఓ కీ రోల్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి బాలయ్య సినిమాలో హీరోయిన్ కన్ఫూజన్ చాలానే ఉందని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. మరి చూడాలి ఏ హీరోయిన్ ను బాలయ్య కోసం బాబీ ఫిక్స్ చేస్తాడో.


Click it and Unblock the Notifications











