NBK110: బాలయ్య ఫ్యాన్స్‌కు బ్లాస్టింగ్ అప్డేట్... పవన్ కల్యాణ్ దర్శకుడితో నటసింహం సినిమా!

నందమూరి బాలయ్య ఫ్యాన్సుకు అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చేసింది. నటసింహం ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NBK109 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ ఏడాదిలోనే షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే NBK110 అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, బ్యానర్ వివరాలు బయటకు వచ్చేసాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అఖండ, వీరసింహరెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహరెడ్డి సినిమాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రాగా... సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ ఏడాది దసరా కానుకగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

NBK 110 Update: Balayya 110 will be directed by Harish Shankar Full Details Here

ఇక భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య సూపర్ హిట్టును అందుకున్నాడు. ఈ సినిమాతో బాలయ్య రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇక ఈ సినిమా రీమేక్ కోసం సౌత్ హీరోలు అంతా లైన్లో ఉన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, దలపతి విజయ్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అంతా ఈ సినిమాను రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక ఈ సినిమా వెండితెరపైనే కాదు... బుల్లితెరపై కూడా రచ్చలేపే రేటింగ్ సాధించింది.

ఇక ప్రస్తుతం బాలయ్య తన 110 సినిమా బిజీలో ఉన్నారు. ఈ సినిమాను మెగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఈయన ఇప్పటికే యానిమల్ సినిమాలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.

NBK 110 Update: Balayya 110 will be directed by Harish Shankar Full Details Here

ఇక ఈ యానిమల్ .. నటసింహంతో తలపడితే.. ఎలా ఉంటుందో స్క్రీన్ మీదే చూడాల్సింది. అయితే బాలయ్య 109 సినిమా సెట్స్ మీద ఉండగానే బాలయ్య 110 సినిమా అప్డేట్ వచ్చింది. పవన్ కల్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తెరకెక్కించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య 110 సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను కేవీఎన్ ప్రోడక్షన్ బ్యానర్ లో తెరకెక్కించున్నారు. ఇక ఈ సినిమాకు సంగీతం దేవీ శ్రీ ప్రసాద్ అందించనున్నారట.

ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాంద్.. లెజెండ్ లాంటి సినిమాకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉండనుంది. అయితే ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాతో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X