‘NBK 111' లో హీరోయిన్‌ ఫిక్స్.. బాలకృష్ణతో స్టార్ హీరోయిన్ రొమాన్స్..

NBK 111: నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. క్లాస్, మాస్, యాక్షన్ అనే తేడా లేకుండా నందమూరి అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త దర్శకులతో భిన్నమైన కథలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ 2 అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. బాలకృష్ణకు ఈ సినిమా కాస్త నిరాశను మిగిల్చింది. దీంతో ఇప్పుడు బాలయ్య తన తదుపరి ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈయన తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరు? అనే ఆసక్తికరంగా మారింది. ఇంతకీ బాలయ్య సరసన నటించే హీరోయిన్ ఎవరంటే?

గతంలో నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన వీర సింహ రెడ్డి (Veera Simha Reddy) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. బాలయ్య మాస్ ఇమేజ్‌ను పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేసిన దర్శకుడిగా గోపీచంద్ మలినేని పేరు తెచ్చుకున్నారు. అందుకే మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సమాచారం ప్రకారం ఈసారి కూడా పవర్‌ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, బాలయ్య మార్క్ డైలాగ్స్‌తో సినిమా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

NBK 111 Heroine Buzz Nayanthara or Kajal Aggarwal for Balakrishna New Movie

అయితే ఈ సినిమా గురించి మొదట్లో వచ్చిన వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ప్రారంభంలో ఇది ఓ పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుందని ప్రచారం జరిగింది. కానీ, కథలో మార్పులు, స్క్రిప్ట్ రీడిజైన్ కారణంగా ప్రాజెక్ట్ మొత్తం కొత్త మలుపు తిరిగిందని తెలుస్తోంది. స్క్రిప్ట్ మారడంతో కొన్ని పాత్రల రూపకల్పన కూడా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల మధ్య హీరోయిన్ ఎంపిక కూడా హాట్ టాపిక్‌గా మారింది.

మొదటగా ఈ సినిమాలో నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటించనున్నట్లు బలంగా ప్రచారం జరిగింది. బాలయ్యతో గతంలో మంచి కెమిస్ట్రీ కనబరిచిన నయనతార పేరు రావడంతో అభిమానులు కూడా ఆసక్తి చూపించారు. అయితే స్క్రిప్ట్ మార్పులు, తేదీల సమస్యలు, పాత్రలో మార్పులు వంటి కారణాలతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా, ఫిల్మ్ నగర్‌లో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది.

నయనతార పేరు వెనక్కి వెళ్లిన తర్వాత ఇప్పుడు కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal)పేరు గట్టిగా వినిపిస్తోంది. సమాచారం ప్రకారం దర్శకుడు గోపీచంద్ మలినేని కాజల్‌ను సంప్రదించగా, ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలో షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. బాలయ్యతో కాజల్ ఇప్పటికే భగవంత్ కేసరి (Bhagavanth Kesari)లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో వారి కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మళ్లీ ఈ జోడీని రిపీట్ చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు, తాజా గాసిప్స్ ప్రకారం ఈ సినిమాలో ఒక హీరోయిన్ మాత్రమే కాదు, ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే నయనతార, కాజల్ ఇద్దరిలో ఒకరు మెయిన్ లీడ్ కాగా, మరో కీలక పాత్రకు ఇంకొకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే క్లారిటీ రానుంది.

ఈ భారీ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సంగీత బాధ్యతలను ఎస్. థమన్ నిర్వహిస్తున్నారు. బాలయ్య సినిమాలకు తమన్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. అందువల్ల ఈ సినిమాపై సంగీత పరంగా కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. త్వరలోనే హీరోయిన్ల ఎంపిక, ఫస్ట్ లుక్, టైటిల్ వంటి అంశాలపై అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం NBK111 టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇలా క్రేజీ అప్డేట్స్ తో ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X