‘NBK 111లో హిట్ కాంబో రిపీట్.. బాలయ్యకు జోడిగా నయనతార కాదు!'

NBK 111 Update: నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా NBK 111. ఈ సినిమా మొదటి నుంచే వార్తల్లో నిలుస్తోంది. ప్రారంభంలో హిస్టారికల్ కాన్సెప్ట్‌తో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్, భారీ బడ్జెట్ కారణంగా మార్పులకు లోనై ఇప్పుడు పక్కా కమర్షియల్ యాక్షన్ డ్రామాగా మారడం విశేషం. ఇప్పటికే వరుస విజయాలతో జోష్‌లో ఉన్న బాలయ్యకు ఇది కెరీర్‌లో కీలకమైన 111వ సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా 'వీరసింహారెడ్డి' తరహా మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ ఉండబోతుందన్న టాక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. సంక్రాంతి బరిలో ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read
Jetlee Day 2 Box Office Collection: 'జెట్‌లీ’కి షాకింగ్ కలెక్షన్లు.. సత్య మూవీకి ఎన్ని కోట్లంటే?
Jetlee Day 2 Box Office Collection: 'జెట్‌లీ’కి షాకింగ్ కలెక్షన్లు.. సత్య మూవీకి ఎన్ని కోట్లంటే?

ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ విషయంలో గత కొన్ని రోజులుగా సస్పెన్స్‌గా ఉంది. మొదటగా 'లేడీ సూపర్ స్టార్' నయనతార హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆమె బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ కూడా మంచి స్పందనను అందుకుంది. అయితే షూటింగ్ ప్రారంభానికి ముందే డేట్స్ క్లాష్ కారణంగా నయనతార ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం పెద్ద ట్విస్ట్‌గా మారింది. ఇదే సమయంలో మేకర్స్ వెంటనే ప్రత్యామ్నాయంగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేయడం. గతంలో 'భగవంత్ కేసరి'లో బాలయ్యతో కలిసి నటించిన కాజల్, మరోసారి ఆయన సరసన నటించబోత ఈ కాంబినేషన్‌పై మళ్లీ ఆసక్తి పెరిగింది. ఆ సినిమా సక్సెస్ సెంటిమెంట్ కూడా ఈ నిర్ణయానికి కారణమైందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Recommended For You
10 ఏళ్లలో ఎన్నో అవమానాలు, అయినా వెనక్కి తగ్గలేదు: శ్రావణ భార్గవి ఎమోషనల్
10 ఏళ్లలో ఎన్నో అవమానాలు, అయినా వెనక్కి తగ్గలేదు: శ్రావణ భార్గవి ఎమోషనల్
NBK 111 Update Kajal Aggarwal Replaces Nayanthara in Balakrishna s Big Film

తాజా సమాచారం ప్రకారం.. కాజల్ అగర్వాల్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం తన డేట్స్‌ను కేటాయించినట్లు ఉంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో బాలకృష్ణ, కాజల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ దాదాపు వారం రోజుల పాటు కొనసాగనుందని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథలో కీలకంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని తన గత సినిమాలతో మహిళా పాత్రలకు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి చూస్తే, NBK 111లో కూడా కాజల్‌కు స్ట్రాంగ్ రోల్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

You May Also Like
ఆ విషయంలో క్షమించండి.. పెద్ది డైరెక్టర్ ఎమోషనల్
ఆ విషయంలో క్షమించండి.. పెద్ది డైరెక్టర్ ఎమోషనల్

ఈ సినిమా ప్రారంభం నుంచే కొన్ని మార్పులు జరుగుతున్నాయి. మొదట అనుకున్న కథ మారడం, హీరోయిన్ మార్పు, షూటింగ్ షెడ్యూల్‌లలో మార్పులు వంటి అంశాలు ప్రాజెక్ట్‌ను ప్రభావితం చేశాయి. ఇప్పుడు మాత్రం టీమ్ పూర్తి ఫోకస్‌తో ముందుకు సాగుతోంది. ఇక రెండో హీరోయిన్‌గా మరో యంగ్ బ్యూటీ ఎంపికయ్యే అవకాశం ఉందని, అలాగే సినిమాలో పలు కీలక పాత్రల్లో స్టార్ నటులు కనిపించనున్నాయని సమాచారం. త్వరలోనే మేకర్స్ పూర్తి కాస్టింగ్ వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

'కమిట్మెంట్ అడిగాడు.. ఆ డైరెక్టర్‌ చెంపలు వాయించా'
'కమిట్మెంట్ అడిగాడు.. ఆ డైరెక్టర్‌ చెంపలు వాయించా'

కాజల్ అగర్వాల్‌కు ఇది టాలీవుడ్‌లో ఒక కీలక రీఎంట్రీగా మారనుంది. కొంత గ్యాప్ బాలయ్య సినిమాతో మళ్లీ పెద్ద ప్రాజెక్ట్‌లో కనిపించిన తర్వాత ఆమె అభిమానులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా మాస్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేయడం ఆమె కెరీర్‌కు మళ్లీ బూస్ట్ ఇవ్వొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. NBK 111పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య మాస్ ఇమేజ్, గోపీచంద్ మలినేని డైరెక్షన్, కాజల్ ఎంట్రీ ఇవన్నీ కలిసి సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిపే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X