నాగచైతన్య...బాలకృష్ణ అల్లుడవుతాడా?
ఏ మాయ చేసావె చిత్రంతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న నాగచైతన్యని తన అల్లుడుగా చేసుకోవటానికి బాలకృష్ణ యోచిస్తున్నారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినపడుతోంది. బాలకృష్ణకి ఇద్దరు కుమార్తెలు (బ్రహ్మిణి, తేజస్వినీ). మొదట కూతురు బ్రహ్మిణిని చంద్రబాబు కుమారుడు లోకేష్ కిచ్చి చేసిన సంగతి తెలిసిందే. ఇక అక్కినేని కుటుంబంతో తమ అనుబంధం కొనసాగటానికి బాలకృష్ణ ఈ ఆలోచన చేస్తున్నట్లు చెప్తున్నారు. నాగేశ్వరరావు కూడా దీనికి సముఖంగానే ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. నాగార్జున మాత్రం అప్పుడే పెళ్ళేమిటి, తర్వాత ఆలోచిద్దాం అన్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం నాగచైతన్య...అజయ్ భుయాన్ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటయ్యారు. తదనంతరం సుకుమార్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించే చిత్రం చేయనున్నాడు.
నాగచైతన్య బాలకృష్ణ సుకుమార్ బ్రహ్మిణి తేజస్వినీ లోకేష్ naga chaitanya balakrishna sukumar tejaswani lokesh


Click it and Unblock the Notifications