'పరమవీర చక్ర' చిత్ర వివాదం...దాసరి దిష్టిబొమ్మ దగ్ధం
బాలకృష్ణ, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం పరమవీర చక్ర. ఈ చిత్రం టైటిల్ మార్చాలని రాష్ట్ర మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో మరో మారు దాసరి నారాయణరావు దిష్టిబొమ్మని దగ్గం చేశారు. దేశ రక్షణ కోసం శత్రు సైన్యాలతో ప్రాణాలొడ్డి పోరాడి అసువులు బాసిన వీర సైనికులకు భారత ప్రభుత్వం ఇచ్చే పరమ వీర చక్ర బిరుదును సినీ రంగం అభాసు పాలు చేస్తోందని మాజీ సైనికల సంక్షమ సంఘం రాష్ట్ర అధ్యక్ష్యులు ఎ.రంగయ్య గౌడ్ అన్నారు. తక్షణమే సినిమా టైటిల్ మార్చకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పరమవీర చక్ర సినిమాకు పెట్టిన పేరుని తొలిగించాలంటూ డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్ ఛౌరస్తాలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద చిత్ర దర్సకుడు దాసరి నారాయణరావు దిష్టి బొమ్మను మహిళలు, మాజీ సైనికులు దహనం చేసారు. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ఈ చిత్రంలో అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ వివిధ రకాల వేషధారణల్లో కనిపించనున్నట్టు సమాచారం. సైనికుడిగా రణరంగంలో శత్రువులపై పోరాటం చేస్తే సినిమా హీరో ఏం చేస్తాడనేది ఆసక్తికరం.


Click it and Unblock the Notifications











