Balakrishna: బాలయ్య అరాచకం మామూలుగా లేదుగా.. ఈ వయసులో మరీ ఈ రేంజ్‌లోనా?
నందమూరి బాలయ్య.. ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ఆయన నెక్ట్స్ మూవీ బాబీ దర్శకత్వంలో చేయనున్నారు. ఇక అది NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇక బాలయ్య NBK 110, NBK 111, NBK 112, NBK 113 సినిమాల లైనప్ ఓ సారి చూస్తే.. ఎవరికైనా కళ్లు చెదరాల్సిందే. ఆయన వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
నందమూరి నటసింహం బాలకృష్ణ.. కరోనా టైం నుంచి ఆయన దశ మారిందనే చెప్పాలి. కరోనా టైంలో అంతా సినిమా రిలీజ్ చేసేందుకు భయపడుతుంటే.. బాలయ్య మాత్రం అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అఖండ విజయం సాధించారు. ఇక ఆ తర్వాత అన్ స్టాపబుల్ షోస్ జనాలకు మరింత దగ్గరయ్యాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వీరసింహరెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఈ దసరా కానుకగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య... కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం విజయవంతంగా దూసుకుపోతుంది. బాలయ్య ఖాతాలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ పడుతున్నాయి. అఖండతో మొదలు అయిన ఆయన విజయం.. భగవంత్ కేసరి దాకా కొనసాగింది. ఇక తదుపరి చిత్రాల కోసం కూడా బాలయ్య కేర్ ఫుల్ గా కథలను ఎంపిక చేసుకుంటున్నారట.

ఇక ఇప్పటికే NBK 109 చిత్రం బాబీ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించాడు బాలయ్య. దానికోసం ఇటీవల లుక్ కూడా మార్చినట్లు భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో తెలిపారు. గడ్డం లేకుండా క్లీన్ షేవ్ లో కనిపించిన బాలయ్య... అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక ఆ విషయం పక్కన పెడితే.. బాలయ్య లైనప్ చూస్తే.. ఏంటబ్బా మరీ ఈ రేంజులో దూసుకుపోతున్నాడు అనిపిస్తుంది. కుర్ర హీరోలకు పోటీగా బాలయ్య వరుస సిినిమాలతో దూసుకుపోతున్నాడు.
NBK 109 సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఇదిలా ఉండగా బాలయ్య NBK 110 సినిమా బోయపాటి శ్రీనుతో ఉంటుందని తెలుస్తోంది. అఖండ సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కనందని అఖండ 2గా రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల స్కంధ ప్రీ రిలీజ్ ఈవెంటులో బోయపాటి శ్రీను ఈ విషయం చెప్పిన సంగతి తెలిసిందే. అఖండకు సీక్వెల్ తీస్తానని ప్రకటించారు. ఈసారి అఘోర పాత్రను కొనసాగించడంతో పాటు.. పొలిటికల్ టచ్ వచ్చేలా బోయపాటి ప్లాన్ చేసుకున్నారట.
ఇక NBK 111 సినిమా పూరీ జగన్నాథ్ లేదా గోపిచంద్ మలినేనితో ఉంటుందని అంటున్నారు. పూరి జగన్నాథ్ తో మరో సినిమా చేస్తానని బాలయ్య ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పూరి కూడా బాలయ్య కోసం కథ రెడీ చేసుకుని ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు వీరసింహారెడ్డి సూపర్ హిట్ అయ్యాక మరోసారి మలినేని గోపీచంద్ తో సినిమా ఉంటుందని బాలయ్య ఇప్పటికే వెల్లడించారు. మరి ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ ఇస్తాడో అనేది చూడాలి.

మలినేని గోపీచంద్, పూరి జగన్నాథ్ సినిమాలు ముందు, వెనక అయినా బాలయ్యకు ఈ రెండు సినిమాలు 111వ, 112వ ప్రాజెక్టులు కానున్నాయని తెలుస్తోంది. ఇక బాలయ్య 113వ సినిమా సుకుమార్ లేదా బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఉండే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది. ఇక బాలయ్య లైనప్ చూస్తే కుర్ర హీరోలకే కాదు బడా హీరోలకు కూడా జలస్ ఉంటుందని అభిమానులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











