Don't Miss!
- Finance Adani-Birla: అదానీని టార్గెట్ చేసిన బిర్లా.. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు..
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ బాబు, అల్లు అర్జున్ కారణంగా వెనక్కి తగ్గిన బాలయ్య! కష్టమే అని భావించారా?
సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ.. తన వెండితెర ప్రయాణాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య.. తన తదుపరి సినిమాను కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఆయన కెరీర్లో 105వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ పెట్టినట్లుగా తెలిసింది.
ఇటీవలే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. ప్రతీ ఏడాది సంక్రాంతి కానుకగా ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడం బాలకృష్ణ స్టైల్. ఈ నేపథ్యంలోనే ఎప్పటిలాగే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ తాజా పరిస్థితుల కారణంగా బాలయ్య తన డిసీజన్ మార్చుకున్నారని తెలిసింది.
ఇప్పటికే యంగ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ సంక్రాంతి బరిలో ఉన్నారు. వీరితో పాటు ఇంకొందరి సినిమాలు కూడా అప్పుడే రిలీజ్ కాబోతున్నాయి. ఇది గమనించి బాలయ్య కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కంటే ముందే.. అంటే డిసెంబర్ మూడో వారంలో తన సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్లో అయితే థియేటర్ల కొరత కూడా ఉండదు కాబట్టి ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.
ఈ సినిమాలో బాలకృష్ణ డిఫెరెంట్ లుక్‌లో దర్శనమీయనున్నారు. ఇప్పటికే బాలయ్యకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.