NBK 110: బాలయ్య కోసం ఆ బ్యూటీని లైన్‌లో పెట్టిన దర్శకుడు... ఆ కోరిక ఇలా తీరనుందా?
నందమూరి నటసింహం బాలయ్య.. ఈ మధ్య కాలంలో ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఆయన వరుస సినిమాలతో ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. ఇక భగవంత్ కేసరి సినిమాతో హిట్ కొట్టిన బాలయ్య.. మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టారు. ఒకటి బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ ఉండనుందని తెలుస్తోంది. అయితే ఆ మూవీ కోసం.. ఓ హీరోయిన్ ను ఫిక్స్ చేశారట. ఆ వివరాలు ఈస్టోరీలో తెలుసుకుందాం.
ఆరు పదుల వయసులో అటు కుర్ర హీరోలకు... ఇటు సీనియర్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు నందమూరి నటసింహం బాలయ్య. అఖండ, వీరసింహరెడ్డి, భగవంత్ కేసరి హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో త్రిష, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

పోస్టర్ లో గొడ్డలికి కళ్లద్దాలు పెట్టి.. వదిలారు. ఇక ఇందులో కూడా మాస్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని తెలుస్తోంది.ఇక ఈ మూవీ పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. ఇక మూవీతో మరో హిట్ కొట్టేందుకు బాలయ్య రెడీ అయిపోయాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది బాలయ్య 110వ చిత్రం. ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన సుకుమార్.. బాలయ్యతో ఎలాంటి సినిమా తీయబోతున్నడు అనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలయ్య క్రష్.. రష్మిక మందన్నా. బాలయ్య కోసమే సుకుమార్ ఆమెను ఈ సినిమా కోసం ఒప్పించారట. ప్రస్తుతం రష్మిక సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అనుబంధంతోనే సుకుమార్ అడిగారని తెలుస్తోంది.
ఇప్పటికే రష్మిక లైనప్ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తూనే.. అటు కోలీవుడ్ బాలీవుడ్ లోనూ బిజీగా ఉంది. రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా.. బాలయ్యతో కలిసి అన్ స్టాపబుల్ షోలో సందడి చేయున్నారు ఈ భామ.ఇప్పటికే రష్మక తన క్రష్ అని చెప్పిన బాలయ్య... ఇప్పుడు ఏకంగా ఐ లవ్ యూ అంటూ చెప్పుకువచ్చాడు.

ప్రోమోలో విజయ్ దేవరకొండకు కాల్ చేసి.. రష్మికకు ఐ లవ్ యూ అని చెప్పాడు బాలయ్య. ఇప్పుడు బాలయ్య, రష్మిక మందన్నా సినిమా అంటే.. వేరే లెవెల్ అంటున్నారు ఫ్యాన్స్. అయితే బాలయ్య సినిమాలో రష్మిక హీరోయిన్ గా కాకుండా ఓ కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఎలాంటి పాత్రలో చేస్తుందో.. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











