NBK111 ను వెంటాడుతున్న బడ్జెట్ కష్టాలు.. బాలకృష్ణ మూవీ నుంచి నయనతార ఔట్?

65 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో ఢీ అంటే ఢీ అంటున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. అఖండతో మొదలుపెట్టి భగవంత్ కేసరి, డాకు మహారాజ్, వీరసింహారెడ్డిలతో వరుసగా నాలుగు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఈ జోరుకు అఖండ 2 బ్రేక్ వేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో బాలయ్య తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది.

తనకు వీరసింహారెడ్డి వంటి హిట్ అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ రెండోసారి సినిమా చేయనున్నారు. ఇది బాలయ్య కెరీర్ కెరీర్‌లో 111వ సినిమా కావడం విశేషం. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బాలయ్య కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రాబోతోందని ప్రచారం జరిగింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ NBK111కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాజాగా బాలయ్య సినిమాకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

NBK111 Balakrishna Gopichand Malineni s film Faces Troubles Nayanthara Exit Rumours Shock Fans

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార ఇందులో హీరోయిన్‌గా నటించనున్నారు. సమ్మర్ కానుకగా 2026 ఏప్రిల్‌‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఆదిలోనే ఈ సినిమాకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. తొలుత పీరియాడికల్, హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో బాలయ్య సినిమాను తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు భావించారు. గతంలో బాలయ్యను ఎన్నడూ చూడని కొత్త అవతారంలో సినిమా ఉంటుందని, అలాగే విజువల్ వండగర్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ దర్శక, నిర్మాతలు, హీరో మనసు మార్చుకున్నట్లు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందు అనుకున్న చారిత్రాత్మక కథ కాకుండా బాలయ్య బాడీ లాంగ్వేజ్‌, ఇమేజ్‌కు తగిన కథతో వెళ్లాలని వీరంతా డిసైడ్ అయినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే సోషల్ మీడియా టాక్ ప్రకారం.. NBK 111 కథ విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గడానికి కారణం బడ్జెట్ అని తెలుస్తోంది. ఈ సినిమాను దాదాపు 170 నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్న అఖండ 2 భారీ నష్టాలను మిగల్చడంతో .. పాన్ ఇండియా స్థాయిలోనూ ఏమాత్రం క్లిక్ కాకపోవడంతో వారిని ఆలోచనలో పడేసింది. ఓటీటీ నుంచి సరిగా ఆదాయం రాకపోవడం, టాలీవుడ్ పరిస్ధితి అంత ఆశాజనకంలా లేకపోవడం, ఈ స్థాయి బడ్జెట్‌తో వెళితే వర్కవుట్ అవుతుందా? అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. బాలయ్యకు ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం అంత బడ్జెట్‌తో వెళ్లడం మంచిది కాదని భావించి ముందు అనుకున్న స్క్రిప్ట్ మార్చేసి దాని స్థానంలో మరో కొత్త కథను సిద్ధం చేసే పనిలో దర్శక నిర్మాతలు ఉన్నారట.

తాజాగా NBK111కి సంబంధించి మరో గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటీ అంటే.. లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. బడ్జెట్ విషయంలో వెనుకా ముందు ఆలోచిస్తున్న ఈ చిత్ర నిర్మాతలు.. కాస్ట్ కటింగ్ పనుల్లో ఉన్నారట. ఈ నేపథ్యంలోనే నయనతారను తప్పించే పనుల్లో మేకర్స్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్య సినిమా కోసం నయన్ ఏకంగా 8 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఖర్చు చేసి ఆమెను హీరోయిన్‌గా పెట్టుకునేకంటే మరో హీరోయిన్‌ని ఎంపిక చేస్తే 6 నుంచి 7 కోట్ల రూపాయలు సేవ్ అవుతుందని భావిస్తున్నారట. అయితే నయనతార ఉంటే ఆ లెక్క వేరే ఉంటుందని చెప్పేవారు కూడా ఉన్నారు. మరి నయనతారని నిజంగానే బాలయ్య మూవీని తప్పించారా? లేక ఇదంతా గాలివార్తేనా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X