NBK111: నయన్ ఔట్.. కాజల్ ఇన్? ఆ బాలీవుడ్ బ్యూటీతో బాలయ్య మాస్ స్టెప్పులు

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna), మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనీ (Gopichand Malineni)కాంబోలో ఓ భారీ బడ్జెట్ మూవీ ( NBK111) తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను మొదట భారీ హిస్టారికల్ కాన్సెప్ట్‌తో రూపొందించాలని ప్లాన్ చేసినట్లు టాక్ వినిపించింది. అయితే భారీ బడ్జెట్, ప్రొడక్షన్ ప్లానింగ్ కారణాల వల్ల కథలో మార్పులు చేసి ఇప్పుడు పక్కా కమర్షియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పులు జరిగినప్పటికీ సినిమా మీద ఉన్న హైప్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ స్పెషల్ మ్యాటరేంటీ?

ఇప్పటికే బాలయ్య వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ముఖ్యంగా వీర సింహా రెడ్డి (Veera Simha Reddy) సక్సెస్ తర్వాత బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబోపై అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో 'NBK111'ను కూడా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ డ్రామా, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన హైలైట్స్ కానున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య కెరీర్‌లో ఇది 111వ సినిమా కావడంతో అభిమానులు దీన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు.

NBK111 Update Balakrishna-Nargis Fakhri Song and Kajal Entry Create Massive Buzz

ఇక ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య సినిమాల్లో మాస్ పాటలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్లలో అభిమానులు విజిల్స్ వేస్తూ డ్యాన్స్ చేసే స్థాయిలో ఆయన పాటలు ఉంటాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్ మలినేని ఈసారి కూడా ఓ స్పెషల్ మాస్ ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri)ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్‌లో 'రాక్‌స్టార్', 'హౌస్‌ఫుల్' సిరీస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నర్గీస్ ఫక్రీ, ఇప్పుడు బాలయ్యతో కలిసి స్టెప్పులు వేయబోతోందనే వార్త నందమూరి అభిమానుల్లో ఎగ్జైట్‌మెంట్ పెంచుతోంది. సమాచారం ప్రకారం ఈ స్పెషల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో షూట్ చేయనున్నారు. బాలయ్య ఎనర్జీకి తగ్గట్టుగా మాస్ బీట్‌తో పాటను కంపోజ్ చేస్తున్నారని, ఇందులో పవర్‌ఫుల్ డ్యాన్స్ మూవ్స్ ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. నర్గీస్ గ్లామర్ ఈ పాటకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో "బాలయ్య-నర్గీస్" కాంబోపై అభిమానులు భారీగా పోస్టులు పెడుతున్నారు. థియేటర్లలో ఈ పాటకు ఫ్యాన్స్ పూనకాలు రావడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు హీరోయిన్ విషయంలో కూడా ఈ సినిమా అనేక ట్విస్టులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార ( Nayanthara)ను అధికారికంగా ప్రకటించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే షూటింగ్ ప్రారంభానికి ముందే డేట్స్ సమస్యలు రావడం, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం, అలాగే ప్రమోషన్స్ విషయంలో కొన్ని షరతులు పెట్టడం వంటి కారణాలతో నయనతార ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

దీంతో మేకర్స్ వెంటనే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే బాలయ్యతో భగవంత్ కేసరి (Bhagavanth Kesari)లో కలిసి నటించిన కాజల్‌కు మంచి స్పందన రావడంతో ఈ కాంబోను మళ్లీ రిపీట్ చేయాలని టీమ్ భావించినట్లు తెలుస్తోంది. కాజల్ కూడా తన డేట్స్‌ను సర్దుబాటు చేసి షూటింగ్‌లో పాల్గొనడానికి వెంటనే ఓకే చెప్పిందట. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో బాలయ్య, కాజల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఈ సినిమాలో కాజల్ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథలో కీలకంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో గోపీచంద్ మలినేని తన సినిమాల్లో మహిళా పాత్రలకు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి చూస్తే, ఈ సినిమాలో కూడా హీరోయిన్ పాత్రకు మంచి వెయిట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మరో హీరోయిన్ కూడా సినిమాలో ఉండొచ్చని వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈసినిమా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించడం వెనుక మార్కెట్ వ్యూహం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌లో మాస్ యాక్షన్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండటంతో, అదే ఫార్ములాతో బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా కథను మళ్లీ రీడిజైన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కీలక యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తి చేసిన మూవీ టీమ్ త్వరలోనే టైటిల్‌ను కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సంక్రాంతి బరిలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు బాలయ్య మాస్ ఇమేజ్, మరోవైపు గోపీచంద్ మలినేని మాస్ టేకింగ్, కాజల్ గ్లామర్, నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్.. ఇవన్నీ కలిసి 'NBK111'ను బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X