బాలకృష్ణ-కొరటాల ప్రాజెక్ట్‌లో ఊహించని మార్పు.. ‘దేవర' మ్యాజిక్ రిపీట్ కాబోతుందా?
నట సింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆయనతో సినిమాలు చేసేందుకు యంగ్ డైరెక్టర్స్‌తో పాటు సీనియర్లు క్యూ కడుతున్నారు. ఈ తరుణంలో బాలయ్య కొత్త సినిమా అంటూ రోజుకో కొత్త డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. అలా తాజాగా నందమూరి బాలకృష్ణ - స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ సెట్ అయ్యింది. ఈ కాంబోలో వస్తున్న NBK112 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్య ఒక పవర్‌ఫుల్ సీఎం పాత్రలో కనిపిస్తారనే వార్త ఇప్పటికే హల్చల్ చేస్తోండగా తాజాగా మరో ఆసక్తికర వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటీ?
గత కొన్ని సంవత్సరాలుగా బాలకృష్ణ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ .తమన్ సంగీతం అందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మ్యూజికల్‌గా ఎలాంటి విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తమన్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాలయ్య మాస్ ఇమేజ్‌ను మరింత ఎలివేట్ చేస్తుందని అభిమానులు భావిస్తారు. అయితే NBK112 కోసం మాత్రం ఈ సక్సెస్‌ఫుల్ కాంబోకు బ్రేక్ పడినట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ - కొరటాల శివ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నారట.

ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందించబోతున్నట్లు టాక్. అనిరుధ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు. ఆయన ఇచ్చే బీజీఎమ్, సాంగ్స్ సినిమాకు ప్రత్యేకమైన ఎనర్జీ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునే మ్యూజిక్‌తో పాటు మాస్ ఎలివేషన్ ఇవ్వడంలో ఆయన దిట్ట. స్ట్రాంగ్ బీజీఎం ఇవ్వగలిగే కంపోజర్‌గా ఆయనకు మంచి పేరు ఉంది.
కొరటాల శివ తన కెరీర్‌లో ఎక్కువగా దేవి శ్రీ ప్రసాద్ తోనే పని చేశారు. 'మిర్చి', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' వంటి సినిమాలు ఈ కాంబోలో సూపర్ హిట్స్‌గా నిలిచాయి. అయితే ఇటీవల 'దేవర' సినిమా కోసం మొదటిసారి అనిరుధ్‌తో పని చేసిన కొరటాల, ఆ సినిమా మ్యూజిక్ రిజల్ట్‌పై పూర్తిగా సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్ సినిమా హైలైట్‌గా నిలవడంతో, అదే మ్యాజిక్‌ను NBK112లో కూడా రిపీట్ చేయాలని భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు.. బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో నటిస్తున్నారు. ఆ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో NBK112 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ మార్పు వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. NBK112 సినిమాను ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
కొరటాల శివ తనకు ప్రత్యేకమైన సామాజిక అంశంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను మేళవించి బాలకృష్ణ ఇమేజ్‌కు సరిపోయే పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారట. ఈ సినిమాలో బాలకృష్ణ సీఎం పాత్రలో కనిపించబోతున్నారని టాక్. ఇలా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు పెరుగుతుండగా, ఇప్పుడు అనిరుధ్ ఎంట్రీ వార్తతో సినిమా హైప్ మరింత పెరిగింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఒక వేళ కానీ బాలకృష్ణ-కొరటాల ప్రాజెక్ట్ లో అనిరుధ్ కూడా జాయిన్ అయితే.. సినిమా స్థాయిని మరో లెవల్‌కు తీసుకెళ్లేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications