ఖలేజా చూపిన మహేష్ నీ ‘దూకుడు’కు సాటెవ్వడు...

By Sindhu

'ఖలేజా" చిత్రం తర్వాత ప్రిన్స్‌ మహేష్‌ బాబు నటిస్తున్న చిత్రం 'దూకుడు". సూపర్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సమంతా హీరోయిన్‌ గా నటిస్తోంది. హ్యాపిడేస్ సోనియా'దూకుడు" చిత్రంలో ఓ ప్రముఖ పాత్రను పోషిస్తున్నారని సమాచారమ్.హ్యాపీడేస్, 'వినాయకుడు, బ్రహ్మాలోకం టు యమలోకం వయా భూలోకం"లో నటించిన సోనియాను ఇప్పుడు ఓ అరుదైన అవకాశం వరించింది. అయితే ఈ చిత్రంలో సోనియా పాత్ర రెండో నాయికగా వుంటుందా, లేక ఒక ముఖ్య పాత్రను ఆమెను పోషిస్తున్నారా అనేది ఇంకా తెలియవలసి వుంది. 16రీల్స్‌ బ్యానర్‌ పై రామ్‌ అచంట, గోపీచంద్‌ అచంట, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. 'దూకుడు" టైటిల్‌ కు తగ్గట్టుగా ఈ చిత్రంలో 'నీ దూకుడుకు సాటెవ్వడు..." అంటూ సాగే ఓ సాంగ్‌ ఉంటుందని తెలుస్తోంది. టర్కీలో చిత్రీకరణ అనంతరం దుబాయ్‌, గుజరాత్‌ లలో షూటింగ్‌ పూర్తిచేసి మార్చిలో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'కిక్", 'బృందావనం" ఫేం తమన్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X