కాపీ కొట్టి తీసాడంటూ ప్రచారం

By Srikanya

హైదరాబాద్ : విడుదల అయ్యాక సినిమా చూసి...ఈ కథ ఫలానా హాలీవుడ్ నుంచి లేపారు...ఈ సీన్ ఫలానా బాలీవుడ్ సినిమా నుంచి ఎత్తుకొచ్చారు అంటూ చెప్పుకునే రోజులు వెళ్లిపోయాయి. ఇప్పుడు ట్రైలర్, ఫస్ట్ లుక్ చూసే ఇది ఫలానా సినిమా నుంచి కాపీ చేసారు అంటూ ప్రచారం మొదలవుతోంది. తాజాగా ఇలాంటి కాపీ ప్రచారాన్నే నీలకంఠ తాజా చిత్రం మాయ ఎదుర్కొంటోంది. అయితే చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ బాగా జరిగిందని తెలుస్తోంది. ఇంతకు ముందు ఏ నీలకంఠ చిత్రానికి లేని విధంగా క్రేజ్ వచ్చింది.

ఈ చిత్రం హాలీవుడ్ సూపర్ హిట్ థిల్లర్ చిత్రం ఫైనవ్ డెస్టినేషన్ నుంచి తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఆ సినిమాలోనూ ముందు జరగబోయే సంఘటనలు, తన మరణ ప్రధానపాత్రకు తెలిసిపోతాయని వాటి నుంచి ఎలా తప్పించుకున్నారనే దిసగా కథనం నడుస్తుందని, అదే కథను కొత్తగా తెలుగు నేటివిటీ అద్ది అందిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అయితే అది నిజమా ..లేక నీలకంఠ ఒరిజనల్ థాట్ తో చిత్రం రూపొందించాడా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే.

Neelakantha's new film Maaya copied

హర్షవర్ధన్‌ రాణే, అవంతిక, సుష్మారాజ్‌, నందినిరాయ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'మాయ'. నీలకంఠ దర్శకుడు. ఎమ్‌.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''మనుషుల్లో ఉండే అతీంద్రీయ దృష్టి నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలిసినప్పుడు తలెత్తే సంఘర్షణ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. కథతో పాటు కథనంలోని కొత్తదనం ప్రేక్షకుల్ని రక్తికట్టిస్తుంది'' అన్నారు.

''నీలకంఠ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని మాయాలోకంలో విహరింపజేసినట్టు ఉంటుంది. శేఖర్‌చంద్ర సమకూర్చిన సంగీతం చిత్రానికి బలాన్నిచ్చింది'' అన్నారు నిర్మాతల్లో ఒకరైన మధుర శ్రీధర్‌రెడ్డి. చిత్రంలో నాగబాబు, ఝాన్సీ, అనితా చౌదరి, వేణు తదితరులు నటించారు. చిత్రానికి ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి, కూర్పు: నవీన్‌ నూలి, కళ: గొల్లపల్లి బాబ్జి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X